భారత్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో కేసుల సంఖ్యలో రోజుకో కొత్త రికార్డు నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో 10వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 270 మందికిపైగా మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 26వేలు దాటింది. మృతుల సంఖ్య 6348కి చేరింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.
మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో మరణాలు..
మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 139 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,436 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 80,229కి చేరింది. 2,849 మంది మరణించారు. 35,156 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
తమిళనాడులో..
తమిళనాడులో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ మరో 1438 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 28,694కి చేరింది. 232 మంది ప్రాణాలు కోల్పోయారు.
యూపీలో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో గత 24 గంటల్లో 502మందిలో వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఫలితంగా వ్యాధిగ్రస్తుల సంఖ్య 9,739కి చేరింది. కరోనా కాటుకు యూపీలో 257మంది బలయ్యారు.
కర్ణాటకలో..
కర్ణాటకలో రికార్డు స్థాయిలో ఇవాళ 515కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా అక్కడ బాధితులు 4,835కి పెరిగారు. అందులో 57మంది మృతి చెందారు.
రాజస్థాన్‌లో..
రాజస్థాన్‌లో కొత్తగా 68 కేసులు బయటపడ్డాయి. మొత్తం రోగుల సంఖ్య 9,930కి చేరగా... వారిలో 213 మంది చనిపోయారు. 7వేల 162 మంది డిశ్చార్జయ్యారు.
కేరళలో..
కేరళలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1697కి చేరింది.
ఇప్పటివరకు 15మంది చనిపోయారు.
ఇదీ చూడండి: 'మరో 80 ఏళ్లలో భారత్కు పెను ముప్పు'