ETV Bharat / bharat

ప్రమాదకర స్థాయిలోనే 'పంచగంగా' ప్రవాహం - Panchganga River floating

మహారాష్ట్ర- కొల్హాపుర్​లో పంచగంగా నది ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తోంది. అయితే శనివారం నాటికి నీటిమట్టం స్వల్పంగా తగ్గినా.. ముప్పు ఇంకా పొంచి ఉందని ఓ అధికారి తెలిపారు.

Panchganga river continues to flow above danger mark in Maharashtra
పంచగంగా నదిలో స్వల్పంగా తగ్గిన నీటిమట్టం
author img

By

Published : Aug 8, 2020, 12:58 PM IST

మహారాష్ట్రలోని కొల్హాపుర్​లో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న పంచగంగా నది నీటి మట్టం స్వల్పంగా తగ్గినా.. ప్రమాద ముప్పు మాత్రం తొలగలేదని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. శుక్రవారంతో పోలిస్తే.. శనివారం నాటికి ప్రవాహం కాస్త తగ్గిందన్నారు.

రాజారామ్​ బ్యారేజ్​ వద్ద 44.6 అడుగుల ఎత్తువరకు నీటి మట్టం చేరగా.. శుక్రవారం సాయంత్రం నాటికి 4 అంగుళాలు తగ్గిందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే.. 43 అడుగులకు మించి ప్రవహిస్తే ప్రమాదకరంగా భావిస్తారు.

ముంపు ప్రాంతాలవారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది.. ఇప్పటివరకు 23 గ్రామాలకు చెందిన సుమారు 5 వేల మందినిపైగా సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

ఇదీ చదవండి: మునిగిన ముంబయి.. ఎగసిపడుతున్న అలలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.