ETV Bharat / bharat

పాత బాటిళ్లపై కొత్త లేబుళ్లు.. రూ.50 లక్షల శానిటైజర్లు సీజ్​ - Corona effect on saniitisers

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శానిటైజర్లు, మాస్కులకు డిమాండ్​ పెరిగింది. ఇదే అదునుగా భావించిన కొందరు ఔషధ దుకాణదారులు గడువు ముగిసిన శానిటైజర్​ బాటిళ్లపై కొత్త లేబుళ్లు అతికించి ప్రజలను దోచుకుంటున్నారు.

Maha firm tampers with sanitiser expiry date labels, raided
పాత బాటిళ్లపై కొత్త లేబుళ్లు.. రూ.50 లక్షల ఔషధాలు సీజ్​
author img

By

Published : Mar 16, 2020, 5:43 PM IST

దేశంలో కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తుండగా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలు మాస్కులు, శానిటైజర్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్​లో కొందరు ఔషధ దుకాణాదారులు, పరిశ్రమల నిర్వాహకులు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని గడువు ముగిసిన శానిటైజర్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సమాచారం అందుకున్న రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన విభాగం(ఎఫ్​డీఏ) అధికారులు దాడులు చేసి రూ. 50లక్షల విలువైన శానిటైజర్లు సీజ్ చేశారు.

ఔరంగబాద్​ పరిసర ప్రాంతం వాలుజ్​ పారిశ్రామిక వాడలోని యూరోలైప్​ హెల్త్​కోర్ సిబ్బంది గడువు ముగిసిన లేబుళ్లు తీసి, 2021తో గడువు ముగిసేలా తయారు చేసిన కొత్త లేబుళ్లను అతికిస్తున్నట్లు ఎఫ్​డీఏ జాయింట్​ కమిషనర్ సంజయ్​ కాలే వెల్లడించారు. అందులో కాలపరిమితితో పాటు ధరలు కూడా మార్చినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'సందేహమే లేదు కరోనాపై పసికందులదే విజయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.