ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ లైవ్​: రిసార్టు రాజకీయాలకు వేళాయే - bjp-madhya

bjp-madhya
ఆపరేషన్ 'కమల్'
author img

By

Published : Mar 10, 2020, 9:25 AM IST

Updated : Mar 10, 2020, 10:08 PM IST

21:58 March 10

రిసార్టు... రిసార్టు...

మధ్యప్రదేశ్​లో రాజకీయ ఉత్కంఠ నెలకొన్న తరుణంలో రిసార్టు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. 22మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో.. మిగిలిన 92మందిని కాపాడుకోవడం కోసం వారిని వేరే ప్రదేశానికి మారుస్తోంది కాంగ్రెస్​. అయితే ఎక్కడికి తరలిస్తోందనే అంశంపై స్పష్టత లేదు. మరోవైపు భాజపా కూడా తన 107మంది ఎమ్మెల్యేలను మరొక ప్రాంతానికి తరలిస్తోంది. ఈ ప్రాంతం వివరాలను వెల్లడించేలేదు.

భాజపా వర్గంలో సంతోష వాతావరణం నెలకొంది. పాటలు పాడుకుంటూ బస్సుల్లో హుషారు నింపుతున్నారు భాజపా ఎమ్మెల్యేలు. తాము హోలీ జరుపుకోవడానికి వెళ్తున్నట్టు భాజపా ఎమ్మెల్యేలు తెలిపారు.

19:43 March 10

ఎప్పుడు చేరతారు?

జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో నేడు చేరతారని ముందు వార్తలు వచ్చినప్పటికీ ఆయన ఈ రోజు చేరే అవకాశం లేదు. అయితే మార్చి 12న ఆయన భాజపాలో చేరే అవకాశం ఉంది.

19:22 March 10

భాజపాలోకి బుధవారం...

సింధియా భాజపాలోకి రేపు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

18:07 March 10

భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా సీనియర్ నేతలు

  • భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
  • రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయనున్న భాజపా సీఈసీ
  • సీఈసీ సమావేశంలో సింధియా పేరు ఖరారు చేసే అవకాశం
  • సీఈసీ సమావేశం పూర్తయ్యేలోగా పార్టీలో చేరనున్న సింధియా

17:55 March 10

  • #MadhyaPradesh: Leader of Opposition in state assembly Gopal Bhargava, Narottam Mishra, and other BJP leaders reach the residence of state assembly Speaker NP Prajapati to submit the resignations of 19 Congress MLAs. pic.twitter.com/voMcoKlxTt

    — ANI (@ANI) March 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

స్పీకర్​ వద్దకు భాజపా...

మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ప్రతిపక్ష నేత గోపాల్​ భార్గవ ఇతర భాజపా నేతలతో కలసి సభాపతిని కలిశారు. 19 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేల రాజీనామ పత్రాలను ఆయనకు సమర్పించారు. విధివిధానాల ప్రకారం వీటిపై నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్​ ప్రజాపతి తెలిపారు.

16:46 March 10

మరో రాజీనామా...

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​కు చెందిన మరో ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాతో మొత్తం 22 మంది తమ పదవులను వదులుకున్నారు.

16:09 March 10

మరో ఇద్దరు...

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ సర్కారు మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుంది. ఇప్పటికే 19 మంది సింధియా వర్గానికి చెందిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తాజాగా మరో ఇద్దరు శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.

15:55 March 10

భాజపా కార్యాలయంలో హోలీ...

మధ్యప్రదేశ్​ భాజపా కార్యాలయంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. త్వరలోనే దీపావళి రాబోతుంది అంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వంలో బీటలు రావడం, సింధియా పార్టీకి రాజీనామా చేయడం వంటి కీలక పరిణామాలు భాజపా శ్రేణుల్లో ఆనందం తెచ్చాయి. 

14:59 March 10

  • 19 Congress MLAs, who are staying in Bengaluru, write a letter to Karnataka DGP, demanding protection&police escort. Letter reads, "We've come to Karnataka voluntarily for some important work, regarding which we require protection for our safe movement&stay in& around Bangaluru". https://t.co/pHiIM3uJtm

మాకు రక్షణ కల్పించండి: ఎమ్మెల్యేలు

కాంగ్రెస్​కు రాజీనామా చేసిన ఆరుగురు మధ్యప్రదేశ్​ ఎమ్మెల్యేలు.. తమకు రక్షణ కల్పించాలంటూ బెంగళూరు డీజీపీకి లేఖ రాశారు. తాము ఒక ముఖ్యమైన పనిలో భాగంగా స్వచ్ఛందంగానే కర్ణాటకకు వచ్చామని.. పోలీస్​ ఎస్కార్ట్​తో తగిన రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. 

14:37 March 10

ప్రజల నమ్మకాన్ని దెబ్బకొట్టారు: గహ్లోత్​

పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియాపై విరుచుకుపడ్డారు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. ప్రజల నమ్మకాన్ని, పార్టీ భావజాలాన్ని దెబ్బకొట్టారని ఆరోపించారు. 

14:25 March 10

ఆ ఆరుగుర్ని వెంటనే తొలగించండి: సీఎం

కాంగ్రెస్​కు రాజీనామా చేసిన ఆరుగురు మంత్రులను వెంటనే తొలగించాలని గవర్నర్​ను కోరారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​ నాథ్​. ఈ మేరకు గవర్నర్​కు సిఫార్సు చేస్తూ లేఖ పంపించారు. 

14:15 March 10

  • Bisahu Lal Sahu: I have resigned from the Congress as well as from the membership of State Assembly. I have joined BJP. Most of the Congress MLAs will resign from the Congress in coming days as they are fed up with the functioning of Kamal Nath govt. https://t.co/lIrXmSRyfV pic.twitter.com/M9515HH5MQ

భాజపాలోకి కాంగ్రెస్​ ఎమ్మెల్యే..

మధ్యప్రదేశ్​ కాంగ్రెస్ సీనియర్​ ఎమ్మెల్యే బిసాహు లాల్​ సాహూ జీ భాజపాలో చేరినట్లు ప్రకటించారు. కమల్​నాథ్​ ప్రభుత్వంపై విసుగుచెందిన చాలా మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు త్వరలో  రాజీనామాలు చేస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్​ నేత శివరాజ్​ సింగ్​ చౌహాన్​ సమక్షంలో భాజపాలోకి చేరారు. 

13:19 March 10

  • 19 Congress MLAs including six state ministers from Madhya Pradesh who are in Bengaluru, tender their resignation from the assembly after Jyotiraditya Scindia resigned from the party. pic.twitter.com/ljTF7p90BV

19 మంది ఎమ్మెల్యేల రాజీనామా

బెంగళూరులో ఉన్న 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను గవర్నర్​కు పంపించారు. జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా విషయం బయటికి వచ్చిన తర్వాత శాసనసభ సభ్వత్వానికి రాజీనామాలు సమర్పించారు. 

12:55 March 10

మధ్యప్రదేశ్​లో మా ప్రభుత్వం నిలబడదు: చౌదురి

  • Adhir Ranjan Chaudhary, Congress leader in Lok Sabha: So yes it will indeed be a loss to our party and I don't think our Govt in Madhya Pradesh will survive. This is the present-day politics of BJP, always tries to topple and destabilize opposition govts https://t.co/XkiPiEwIjO pic.twitter.com/kM7RSbZihn

పార్టీలో ఎన్నో సీనియర్ పదవులను సింధియా పొందారని కాంగ్రెస్ లోక్​సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదురి అన్నారు. ప్రధాని మోదీ ఊరించిన మంత్రి పదవి కారణంగానే సింధియా రాజీనామా చేశారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. భాజపాతో సింధియాలకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని గుర్తుచేశారు.  

ఏదీ ఏమైనప్పటికీ పార్టీకి భారీ నష్టమని అభిప్రాయపడ్డారు చౌదురి. మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నిలుస్తుందని అనుకోవట్లేదన్నారు. భాజపా ప్రస్తుత రాజకీయాలు ఇలానే ఉన్నాయని విమర్శించారు. 

12:53 March 10

కాంగ్రెస్​కు సింధియా గుడ్​బై- భాజపాలో చేరినట్లేనా?

కాంగ్రెస్​ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈమేరకు రాసిన రాజీనామా లేఖ... దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సింధియా భేటీ అయిన కాసేపటికే వెలుగులోకి వచ్చింది.

"18 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నాను. ఇప్పుడు మారే సమయం వచ్చింది. గతేడాది నుంచి జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణమని మీకు కూడా తెలుసు. ప్రజలకు, నా రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలన్నదే మొదటి నుంచి నా లక్ష్యం. కానీ... ఈ(కాంగ్రెస్​) పార్టీతో కలిసి నేను ఇంకా ఆ పని చేయలేనని భావిస్తున్నా. నా ప్రజలు, అనుచరుల ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త ప్రయాణం ప్రారంభించడమే సరైన పని అని విశ్వసిస్తున్నా."

-జ్యోతిరాదిత్య సింధియా

సింధియా రాజీనామా చేశారని తెలిసిన కాసేపటికే కాంగ్రెస్​ అధిష్ఠానం కీలక ప్రకటన చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ ఆయనను కాంగ్రెస్​ నుంచి బహిష్కరించేందుకు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపారని ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

భాజపా వైపు అడుగులు!

మధ్యప్రదేశ్​లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపాతో సింధియా కలుస్తారన్న వార్తల నడుమ ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఉదయం దిల్లీలో ఇదే అంశంపై చర్చలు జరిగినట్లు సమాచారం.

భాజపాలో సింధియా చేరితే కమల్​నాథ్ ప్రభుత్వం కష్టాల్లో పడినట్లేనని పలువురు భావిస్తున్నారు. సింధియా వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తప్పుకుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలటం ఖాయంగానే కనిపిస్తోంది.

అసంతృప్తే కారణం!

మధ్యప్రదేశ్​ రాజకీయ కార్యకలాపాల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవటం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానంపై సింధియా వర్గం ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. 2018నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుని పార్టీకి అధికారం తెచ్చిపెట్టిన సింధియాకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. అప్పటి నుంచి పార్టీపై గుర్రుగా ఉన్న ఆయన పలుసార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

రెండోది.. సింధియాను రాజ్యసభకు పంపాలని ఆయన వర్గం చాలా రోజుల నుంచి పట్టుబడుతోంది. అయితే ఆయన స్థానంలో ప్రియాంక గాంధీని నామినేట్‌ చేయాలని పార్టీలోని మరో వర్గం డిమాండ్‌ చేస్తోంది. ఈ పరిస్థితుల నడుమ నిన్న తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరుకు మకాం మార్చారు.

సింధియాతో రాజీ కోసం కాంగ్రెస్‌ అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వీలుగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని సీఎం కమల్‌నాథ్‌ నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు 20 మంది మంత్రులు తమ పదవులను త్యాగం చేశారు. అయినప్పటికీ సింధియా వర్గం వెనక్కు తగ్గలేదు.

12:33 March 10

కాంగ్రెస్ నుంచి సింధియా బహిష్కరణ

పార్టీ నుంచి జ్యోతిరాధిత్య సింధియాను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా బహిష్కరణ వేటు వేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.  

12:16 March 10

కాంగ్రెస్​కు ఊహించని షాక్​..

మధ్యప్రదేశ్​లో అధికార కాంగ్రెస్​కు ఊహించని షాక్​ తగిలింది. సీనియర్​ నేత జ్యోతిరాధిత్య సింధియా.. పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. 

12:10 March 10

  • Congress leader Digvijaya Singh: We have evidence that three chartered plane (which reportedly flew Congress MLAs to Bengaluru) were arranged by the BJP. This is part of a conspiracy to reverse the mandate of people of Madhya Pradesh because Kamal Nath has acted against mafias. pic.twitter.com/zafZ7y2oDh

'రిసార్టు రాజకీయంలో కుట్రకోణం'

17మంది కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు బెంగళూరు రిసార్టుకు చేరుకోవడంలో కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. భాజపా నేతల సహాయంతోనే మూడు ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించారన్న సమాచారం తమకు ఉందని పేర్కొన్నారు.  

11:58 March 10

కమల్​నాథ్ నివాసంలో కాంగ్రెస్ ముఖ్యుల భేటీ

మధ్యప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జీతూ పట్వారీ, బాల బచ్చన్, సజ్జన్ సింగ్ వర్మ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ నివాసానికి చేరుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

11:50 March 10

ముగిసిన మోదీ-సింధియా భేటీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్​షాలతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అసంతృప్త నేత జ్యోతిరాధిత్య సింధియా భేటీ ముగిసింది. ప్రధాని నివాసం నుంచి షా, సింధియా బయటకొచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా భాజపా సీనియర్ నేతలు శివరాజ్ సింగ్ చౌహాన్, వీడి శర్మ, వినయ్ సహస్రబుద్ధే తాజా పరిణామాలపై భేటీ అయ్యారు.  

11:01 March 10

మోదీ, అమిత్​షాతో సింధియా సమావేశం

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​షాలతో సమావేశమయ్యారు కాంగ్రెస్ అసంతృప్త నేత జ్యోతిరాధిత్య సింధియా. తన వర్గానికి చెందిన 17మంది ఎమ్మెల్యేలు బెంగళూరు రిసార్టులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత భేటీ రాజకీయంగా కీలకం కానుంది. 

10:55 March 10

'ప్రభుత్వ మనుగడపై భయాలు లేవు'

మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ నేత పీసీ శర్మ స్పందించారు. పార్టీ నేతలతో చర్చిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో అసంతృప్త నేత జ్యోతిరాధిత్య సింధియాను వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు వెల్లడించారు.

10:35 March 10

'ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు'

మధ్యప్రదేశ్​లో  రాజకీయ సంక్షోభం తలెత్తిన అనంతరం తొలిసారిగా స్పందించారు భాజపా నేత శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్​ అంతర్గతమని వ్యాఖ్యానించారు.  

10:11 March 10

నేటి సాయంత్రం భాజపా, కాంగ్రెస్ కీలక భేటీలు

రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అదే సమయంలో భాజపా పక్షం 7 గంటలకు భేటీ కానుందని సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశాలు వేదికగా నేతలు వ్యూహ రచన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

09:32 March 10

narottam
నరోత్తం మిశ్రా స్పందన

'సింధియాకు తలుపులు తెరిచే ఉన్నాయి'

మధ్యప్రదేశ్ పరిణామాలపై స్పందించారు మధ్యప్రదేశ్ భాజపా నేత నరోత్తం మిశ్రా. జ్యోతిరాధిత్య సింధియాను భాజపాలోకి ఆహ్వానిస్తారా అన్న విలేకరుల ప్రశ్నపై తమ పార్టీలోకి అందరికీ ఆహ్వానం ఉంటుందన్నారు. సింధియా పెద్ద నేత అని వ్యాఖ్యానించారు. బెంగళూరు రిసార్టులో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఉండటంపై ప్రత్యర్థి వర్గానికి చెందినవారు స్నేహితుల ఇలాకాలో ఉన్నారని.. వారి గురించి తర్వాత మాట్లాడదామని పేర్కొన్నారు. 

08:41 March 10

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​​కు షాక్​.. సింధియా రాజీనామా

మధ్యప్రదేశ్​ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ రెబల్​ ఎమ్మెల్యేలు 17మంది అదృశ్యమవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో నేడు భాజపా శాసనసభాపక్షం సమావేశం కానుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది భాజపా.

అయితే రెబల్ ఎమ్మెల్యేలు కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలోని  ఓ ప్రైవేటు రిసార్టుకు చేరుకున్నారని సమాచారం. రెబల్​ శాసనసభ్యులు కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన వారని సమాచారం. ప్రస్తుతం సింధియా ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటం, శాసనసభ్యులు ప్రత్యేక విమానంలో బెంగళూరు రిసార్టుకు చేరడం ప్రభుత్వ మనుగడపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ​ముఖ్య నేతలు సీఎం కమల్​నాథ్ ఇంటిలో అత్యవసర భేటీ నిర్వహించారు. కేబినెట్ పునర్​వ్యవస్థీకరణకు నిర్ణయం తీసుకున్నారు సీఎం కమల్​నాథ్.  

230 సీట్లున్న అసెంబ్లీలో అధికార కమల్​నాథ్​ ప్రభుత్వానికి 120మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో కాంగ్రెస్ 114, బీఎస్​పీ 2, సమాజ్​వాదీ పార్టీకి ఒక శాసనసభ్యుడు ఉన్నారు. మరో నలుగురు స్వతంత్రులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. భాజపాకు 107మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో 17మంది ఎమ్మెల్యేల అదృశ్యం రాజకీయంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.

Last Updated : Mar 10, 2020, 10:08 PM IST

For All Latest Updates

TAGGED:

bjp-madhya
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.