ETV Bharat / bharat

కరోనా విజృంభణ: 24 గంటల్లో 485 కేసులు నమోదు - కరోనా మరణాలు

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాజస్థాన్​లో మరో 40 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్​లోనూ కొత్తగా 72 మందికి మహమ్మారి సోకింది. దేశవ్యాప్తంగా నిన్న 485 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5274కు చేరగా ఇప్పటివరకు 149 మంది ప్రాణాలు కోల్పోయారు.

Madhya Pradesh: 72 new COVID-19 cases; state tally now 385
కరోనా విజృంభణ: 24 గంటల్లో 485 కేసులు నమోదు
author img

By

Published : Apr 9, 2020, 5:45 AM IST

దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 5,274కు చేరాయి. ఇప్పటివరకు 149 మంది ఈ మహమ్మారి బారినపడి మరణించారు. మొత్తం 410 మంది కోలుకుని.. ఇళ్లకు వెళ్లారు. వైరస్‌ కేసులు పెరుగుతున్నందున దిల్లీలో 20 హాట్‌స్పాట్‌ ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

రాజస్థాన్​లో...

రాజస్థాన్​లో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. బుధవారం ఒక్కరోజే 40 మందికి వైరస్​ సోకింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 383 మంది మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో ఎక్కువ మందికి తబ్లీగీ జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్న వారితో సంబంధాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

72కొత్త కేసులు నమోదు...

మధ్యప్రదేశ్​లోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. బుధవారం మరో 72 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. రాష్రవ్యాప్తంగా ఇప్పటివరకు 385మంది వైరస్​ బారిన పడ్డారు. రాష్ట్రంలో వాణిజ్య నగరమైన ఇండోర్​లో అధికంగా 213 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 29మంది వైరస్​కు బలయ్యారు.

426 మంది వారే..

దేశ రాజధానిలో ఒక్కరోజులో ఎకంగా 93 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటికి దిల్లీలో వైరస్ సోకిన వారి సంఖ్య 669కి చేరింది. వీరిలో 426 మంది తబ్లీగీ జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 2,500మందిని క్వారంటైన్​లో ఉంచినట్లు పేర్కొన్నారు.

వైరస్‌ తీవ్రత దృష్ట్యా 20 హాట్‌స్పాట్‌ కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది కేజ్రీవాల్‌ సర్కార్. నిత్యవసరాలను ఇంటికే సరఫరా చేస్తామని తెలిపింది.

యూపీలో 361మందికి...

ఉత్తర్​ప్రదేశ్​లో బుధవారం ఆగ్రాకు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. రాష్ట్రంలో వైరస్​ కారణంగా ఇప్పటివరకు నలుగురు మరణించారు. 361 మందికి మహమ్మారి సోకింది.

197కు చేరిన కేసులు...

మహారాష్ట్ర పుణెలో కొత్తగా 10 మంది కరోనాకు బలయ్యారు. బుధవారం ఒక్కరోజే మరో 39 కేసులు నమోదు కాగా.. జిల్లాలో వైరస్​ సోకిన వారి సంఖ్య 197కు చేరినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చనిపోయిన వారిలో చాలామందికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

జమ్ములో తొలి మరణం...

జమ్ముకశ్మీర్​లోని ఉధమ్​పుర్​ జిల్లాలో 61 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మరణించింది. జమ్ములో ఇది తొలి కరోనా మృతి కాగా.. కశ్మీర్​లో ఇప్పటికే ముగ్గురు బలయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.