గాంధీనగర్ లోక్‌సభ స్థానంలో అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందో తెలపాలని స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను భాజపా పరిశీలకుల బృందం శనివారం ఆహ్వానించింది.
"అమిత్ షానే గాంధీనగర్ నుంచి పోటీ చేయాలని భాజపా కార్యకర్తలు కోరుతున్నారు. పార్టీ పరిశీలకుల బృందానికి ఇదే విషయం చెప్పాను. అందరూ కోరుకునే వ్యక్తినే పోటీలో నిలిపితే బాగుంటుంది. గతంలో సర్ఖేజ్ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారు షా. గాంధీనగర్ లోక్‌సభ స్థానం పరిధిలో సర్ఖేజ్ భాగమే. ఇక్కడి పరిస్థితులు ఆయనకు స్పష్టంగా తెలుసు. మా ప్రతినిధిగా అమిత్‌షానే సరైన వ్యక్తి. "
-కిశోర్ చౌహాన్, వెజాల్పూర్ ఎమ్మెల్యే
గాంధీనగర్ స్థానం నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు ఎల్కే అడ్వాణీ.
ఇదీ చూడండి:"ప్రజలు సరైన వారినే ఎన్నుకుంటారు"