బడ్జెట్ 2020-21 మొదటి దఫా పార్లమెంట్ సమావేశాలు ఇవాళ ముగిశాయి. మార్చి 2న ఉభయసభలు పునఃప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి.
జనవరి 31న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2020-21 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
కర్ణాటక ఎస్టీ బిల్లుకు ఆమోదం...
కర్టాటకలోని కొన్ని గిరిజన తెగకు చెందిన వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చే బిల్లుకు ఇవాళ పార్లమెంటు ఆమోదం తెలిపింది. 2019 షెడ్యూల్డ్ గిరిజన సవరణ బిల్లు లోక్సభలో మూజువాణీ ఓటు ద్వారా ఆమోదం పొందింది. గత సమావేశాల్లోనే ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
ఈ బిల్లు ద్వారా కర్ణాటకలోని పరివారా, తలవారా గిరిజన తెగలు.. ఎస్టీ జాబితాలోకి రానున్నారు. ఇక నుంచి వీరు ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ పథకాలను పొందనున్నారు.
ఇదీ చూడండి: 'ముజఫర్పుర్' కేసు దోషికి జీవితఖైదు