దేశంలో లాక్‌డౌన్ విధించాక తొలిసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ నియంత్రణపై పలు సూచనలు చేశారు. కరోనా వైద్యపరీక్షలు గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్. ర్యాండమ్ పద్ధతిలో కరోనా వైద్యపరీక్షలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.
"ప్రస్తుతం వ్యూహాత్మకంగా కరోనా వైద్య పరీక్షలు జరగట్లేదు. కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కరోనా నివారణకు లాక్‌డౌన్ పరిష్కారం కాదు. లాక్‌డౌన్ తర్వాత కరోనా వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంది. లాక్‌డౌన్... కరోనా వైరస్ వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుంది.
కేరళ వయనాడ్‌లో కరోనా నియంత్రణ సమర్థంగా జరుగుతోంది. కేరళలో జిల్లా స్థాయి వైద్య పరికరాలతో సమర్థంగా కట్టడి చేస్తున్నారు.
-రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత
లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు, పేదలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రాహుల్.