ETV Bharat / bharat

లైవ్​: అశ్రునయనాలతో సుష్మకు అంతిమ వీడ్కోలు - సంతాపం

లైవ్​: సుష్మా స్వరాజ్​కు ప్రముఖుల కన్నీటి నివాళి
author img

By

Published : Aug 7, 2019, 8:47 AM IST

Updated : Aug 7, 2019, 4:10 PM IST

15:47 August 07

సుష్మకు కన్నీటి వీడ్కోలు

సుష్మ భౌతికకాయం లోధి రోడ్​ శ్మశాన వాటికకు చేరుకుంది. మరికాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, భాజపా సీనియర్​ నేత అడ్వాణీ సుష్మ అంతిమ వీడ్కోలుకు హాజరయ్యారు.

15:08 August 07

సుష్మా స్వరాజ్​ అంతిమ యాత్ర ప్రారంభం

గుండెపోటుతో కన్నుమూసిన విదేశాంగ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ అంతిమ యాత్ర ప్రారంభమైంది.

అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో సుష్మ అంత్యక్రియలు జరగనున్నాయి.

14:52 August 07

సుష్మ మృతికి అమెరికా సంతాపం

సుష్మాస్వరాజ్ మృతిపట్ల సంతాపం తెలిపింది అమెరికా రాయబార కార్యాలయం.

  • అమెరికా- భారత్‌ సంబంధాల బలోపేతానికి సుష్మాస్వరాజ్ ఎంతో కృషి చేశారు.
  • 2018 ద్వైపాక్షిక చర్చల్లో సుష్మాస్వరాజ్ కీలకపాత్ర పోషించారు.

13:34 August 07

శ్రద్ధాంజలి ఘటించిన యోగి

పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. దివంగత నేతకు శ్రద్ధాంజలి ఘటించారు. 

13:19 August 07

అమిత్​ షా, నడ్డా నివాళులు

భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకున్న సుష్మా స్వరాజ్​ భౌతిక కాయానికి పార్టీ అధ్యక్షుడు అమిత్​ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులు అర్పించారు. 

12:58 August 07

భాజపా ప్రధాన కార్యాలయంలో సుష్మ పార్థివదేహం

సుష్మా స్వరాజ్​ భౌతికకాయం భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం భాజపా ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

12:35 August 07

భాజపా కార్యాలయానికి సుష్మ భౌతికకాయం...

సుష్మా స్వరాజ్​ భౌతికకాయాన్ని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం భాజపా ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అనంతరం ప్రభుత్వ అధికార లాంఛనాలతో విదేశాంగ మాజీ మంత్రి అంత్యక్రియలు జరగనున్నాయి.

12:16 August 07

సుష్మకు 'విదేశీ వందనం'

సుష్మా స్వరాజ్​ మృతి పట్ల అనేక దేశాలు సంతాపం తెలిపాయి. భారత్​తో సంబంధాలు బలపడటంలో సుష్మ కీలక పాత్ర పోషించారని కొనియాడాయి. సింగపూర్​, రష్యా, యూఏఈ దేశాల విదేశాంగ మంత్రులు సుష్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

భారత్​లోని ఇజ్రాయెల్ రాయబారి రాన్​ మల్కా... సుష్మా స్వరాజ్​ భౌతికకాయానికి నివాళులర్పించారు. తమ దేశానికి సుష్మ మంచి మిత్రురాలని కొనియాడారు.​

12:01 August 07

సుష్మ మృతితో భాజపా నేతల భావోద్వేగం

విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. 67 ఏళ్ల సుష్మ దేశ రాజకీయల్లో కీలక పాత్ర పోషించారు. సుష్మ భౌతికకాయాన్ని ప్రజలు, నేతల సందర్శనార్ధం ఆమె నివాసానికి తరలించారు. రాత్రి నుంచి సుష్మా స్వరాజ్​ పార్థివదేహాన్ని సందర్శించడానికి భారీ సంఖ్యలో నేతలు, ప్రజలు ఆమె నివాసానికి తరలివెళ్లారు.  భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. సుష్మ మృతితో కొందరు నేతలు భావోద్వేగానికి లోనయ్యారు.

మరికొద్ది సేపట్లో సుష్మ భౌతికకాయాన్ని దిల్లీలోని భాజపా కార్యాలయానికి తరలించే అవకాశముంది. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో సుష్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనె అవకాశముందని సమాచారం.

11:44 August 07

'ప్రజల నేత సుష్మ...'

సుష్మా స్వరాజ్​ మృతిపై లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా స్పందించారు. సుష్మ అందరి సమస్యలను అర్థం చేసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేవారని తెలిపారు. సుష్మ హఠాన్మరణంతో ఈరోజు దేశం మెత్తం బాధపడుతోందన్నారు.

11:29 August 07

సుష్మా స్వరాజ్​ మృతిపై ఆజాద్​ స్పందన..

సుష్మా స్వరాజ్​ మృతిపై కాంగ్రెస్​ సీనియర్​ నేత గులామ్​ నబీ అజాద్​ స్పందించారు.

  • సుష్మాస్వరాజ్ అన్ని పార్టీల నేతలతో సోదరిగా ఉండేవారు
  • భాజపాలో గొప్ప, ధీరోధాత్తమైన నాయకురాలు
  • పార్టీపరంగా కొన్ని అంశాలపై విభేదించినప్పటికీ వ్యక్తిగతంగా అందరితో చాలా బాగా ఉండేవారు

11:17 August 07

రాజ్యసభలో సంతాపం..

సుష్మా స్వరాజ్​ మృతి పట్ల రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు, సభ్యులు సభలో సంతాపం తెలిపారు. సభలో కొంతసేపు మౌనం పాటించారు.

11:14 August 07

సుష్మ నివాసం వద్ద రాహుల్​ గాంధీ...

విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ నివాసానికి కాంగ్రెస్​ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ చేరుకున్నారు. సుష్మ భౌతికకాయానికి నివాళులర్పించారు.

10:56 August 07

హరియాణాలో సంతాప దినాలు

హరియాణా ప్రభుత్వం రెండు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. సుష్మా స్వరాజ్ హఠాన్మరణం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దిల్లీ ప్రభుత్వం సుష్మ మృతి పట్ల రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.​

10:44 August 07

సుష్మా స్వరాజ్​కు అమిత్​ షా నివాళి...

సుష్మ నివాసానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అమె పార్థివదేహానికి నివాళులర్పించారు. జాతీయ రాజకీయాల్లో సుష్మ చెరగని ముద్ర వేశారని మంగళవారం రాత్రి ట్వీట్​ చేశారు షా. 

10:33 August 07

సుష్మ నివాసానికి మన్మోహన్​ సింగ్​...

సుష్మా స్వరాజ్​ భౌతికకయానికి మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

10:20 August 07

అడ్వాణీ భావోద్వేగం...

విదేశాంగ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ పార్థివదేహానికి భాజపా సీనియర్​ నేత ఎల్​కే అడ్వాణీ నివాళులర్పించారు. సుష్మా భౌతికకాయం చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు అడ్వాణీ.

09:51 August 07

సుష్మా స్వరాజ్​కు ప్రధాని నివాళి..

సుష్మా స్వరాజ్​ భౌతికకాయానికి ప్రధాని నివాళులర్పించారు. సుష్మా కుటుంబ సభ్యులను మోదీ ఓదార్చారు. ఈరోజు సాయంత్రం జరగనున్న సుష్మా స్వరాజ్​ అంత్యక్రియల కార్యక్రమంలో మోదీ పాల్గొంటారని సమాచారం.

09:46 August 07

సుష్మా నివాసానికి వెంకయ్య...

దిల్లీలోని సుష్మా స్వరాజ్​ నివాసానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు... అమె పార్థివదేహానికి నివాళులర్పించారు.

09:32 August 07

రెండు రోజులపాటు సంతాప దినాలు

సుష్మాస్వరాజ్‌ పార్థివదేహానికి రాష్ట్రపతి నివాళులర్పించారు. సుష్మా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

09:24 August 07

సుష్మాస్వరాజ్‌ పార్థివదేహానికి రాష్ట్రపతి నివాళి

సుష్మా స్వరాజ్​ మృతి ఎంతో బాధాకరమని భాజపా సీనియర్​ నేత ఎల్​కే అడ్వాణీ తెలిపారు. సుష్మా మృతి వల్ల వ్యక్తిగతంగా తనకు ఎంతో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందన్నారు.

09:06 August 07

'దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది'

సుష్మా స్వరాజ్​ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సుష్మాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుష్మా స్వరాజ్​ గొప్ప నేత, మంచి వ్యక్తి అని కొనియాడారు.

08:48 August 07

'సుష్మాస్వరాజ్ మృతి చాలా బాధాకరం'

భాజపా సీనియర్ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా.. దిల్లీ ఎయిమ్స్​లో గుండెపోటుతో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్​లో సుష్మా స్వరాజ్ జన్మించారు. 1970లలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్​ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. ఎంపీగా ఏడుసార్లు, మూడుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు సుష్మా.

1977లో 25 ఏళ్ల పిన్న వయసులోనే హరియాణా కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. దిల్లీ ఐదో ముఖ్యమంత్రిగా పనిచేసిన సుష్మా... 1998 అక్టోబర్‌ 13 నుంచి డిసెంబర్‌ 3 వరకు ఈ బాధ్యతల్లో కొనసాగారు. వాజ్‌పేయీ హయాంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా, సమాచారశాఖ మంత్రిగా సేవలు అందించారు. 2009 నుంచి 2014 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు. ఆరోగ్య కారణాల రీత్యా 2019లో పోటీకి దూరంగా ఉన్నారు సుష్మాస్వరాజ్‌.

సుష్మాస్వరాజ్‌ భర్త స్వరాజ్‌ కౌశల్‌ సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది. 1990 నుంచి 1993 వరకు మిజోరాం గవర్నర్‌గా పనిచేశారు స్వరాజ్‌ కౌశల్‌.

08:26 August 07

సుష్మ ఇక లేరు...

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Wednesday, 7 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2259: US Celia Au Content has significant restrictions, see script for details 4223964
'Wu Assassins' star Celia Au reveals how the yellow Power Ranger impacted her
AP-APTN-2247: US Guillermo Del Toro WOF AP Clients Only 4223960
Guillermo Del Toro: ‘Do not believe the lies’ about immigrants
AP-APTN-2225: ARCHIVE R Kelly AP Clients Only 4223966
Federal charges ramp up pressure on R. Kelly to make deal
AP-APTN-2218: US Art of Racing in the Rain Content has significant restrictions, see script for details 4223965
Amanda Seyfried and Milo Ventimiglia share different approaches to emotional scenes
AP-APTN-2128: US Snoh Aalegra ASAP Rocky Content has significant restrictions, see script for details 4223956
Swedish singer Snoh Aalegra says the ASAP Rocky case was confusing
AP-APTN-2104: US Toni Morrison Readers Reax AP Clients Only 4223952
Readers react to death of Toni Morrison
AP-APTN-2032: ARCHIVE Auli'i Cravalho AP Clients Only 4223779
Auli'i Cravalho to star in 'Little Mermaid' live for ABC
AP-APTN-2018: Denmark Plane Crash Part no access Denmark 4223874
Pink manager's plane crash lands in Aarhus UPDATED WITH ARCHIVE VIDEO OF PINK
AP-APTN-1945: US Toni Morrison Documentary AP Clients Only 4223944
Clips of Toni Morrison documentary 'The Pieces I Am,' now playing in theaters
AP-APTN-1511: OBIT Toni Morrison LONG Content has significant restrictions, see script for details 4223898
Nobel laureate Toni Morrison dies at 88 - UPDATED WITH ADDITIONAL MATERIAL
AP-APTN-1417: OBIT Toni Morrison AP Clients Only 4223888
Nobel laureate Toni Morrison dies at 88
AP-APTN-1358: ARCHIVE Meek Mill AP Clients Only 4223885
Meek Mill retrial decision rescheduled to later this month
AP-APTN-1221: US Manson 50 Years AP Clients Only 4223868
Former AP reporter talks Manson 50 years later
AP-APTN-1153: UK CE Girl on the Train Rituals Content has significant restrictions, see script for details 4223863
Stars of 'The Girl on the Train' stage play discuss their pre and post-show rituals
AP-APTN-1148: US CE Dora Content has significant restrictions, see script for details 4223858
'Dora' cast recall personal real-life adventures
AP-APTN-0929: US Bennett's War Content has significant restrictions, see script for details 4223831
Trace Adkins calls mass shootings 'horrible,' but says 'no' to new gun control legislation
AP-APTN-0812: US 90210 Spelling Garth Content has significant restrictions, see script for details 4223826
BH90210 stars Jennie Garth, Tori Spelling remember Luke Perry in unique reboot
AP-APTN-0741: US Kitchen Premiere Content has significant restrictions, see script for details 4223822
‘The Kitchen’s’ action stars Elisabeth Moss and Melissa McCarthy are still giddy about meeting the US Women’s soccer team
AP-APTN-0034: ARCHIVE Constance Wu AP Clients Only 4223802
ABC says cast and crew of 'Fresh Off the Boat' are ready to get back to work and put star Constance Wu's anti-renewal tirade behind them
AP-APTN-0019: US Laura Gomez Content has significant restrictions, see script for details 4223791
Laura Gomez on OITNB legacy, representation for people of color, and racism, colorism in the Dominican Republic
AP-APTN-0001: ARCHIVE Harvey Weinstein AP Clients Only 4223800
Judge rejects Harvey Weinstein's appeal over sex trafficking charge
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 7, 2019, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.