ఒడిశా కేంద్రపార జిల్లాలోని మధు సాగర్ విద్యా పీఠ్‌లో... సైన్స్ టీచర్‌గా పని చేస్తున్న గీతాంజలి సామల్‌కు పర్యావరణంపై మక్కువ ఎక్కువ. తన చుట్టూ ఉన్న... పరిసరాలను పచ్చదనంతో నింపేయడమే ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం.. ఆమె రోజు తన ద్విచక్రవాహనంపై మొక్కలను తీసుకెళ్లి..ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపిస్తే అక్కడ.. మొక్కలు నాటుతారు. కేవలం మొక్కలు నాటి తన పని అయిపోయిందని అనుకోరు గీతాంజలి. వాటికి రోజు నీరు పోసి అవి ఏపుగా ఎదిగే వరకు పెంచుతారు. రోడ్డు డివైడర్లు, పార్కులు, పాఠశాల ప్రాంగణాలు ఇలా తనకు ఖాళీగా కనిపించిన ప్రాంతాన్ని.. ఆ టీచరమ్మ హరితవనంలా మారుస్తారు.
2012లో ఈ హరితయజ్ఞాన్ని ప్రారంభించిన గీతాంజలి టీచర్.... ఇప్పటికీ అవిశ్రాంతంగా తన ప్రవృత్తిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకూ..10వేల మొక్కలకు పైగా నాటారు. ఆమె హరిత యజ్ఞంలో ఏ స్వచ్ఛంద సంస్థ సాయం తీసుకోకుండా సొంత ఖర్చుతోనే.. ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గీతాంజలి నెల జీతం 20 వేలలో దాదాపు 15 వేల రూపాయలు మొక్కల పెంచేందుకే..... వినియోగిస్తున్నారు. కొన్ని మొక్కలను ఆమె సొంతంగా నాటితే మరికొన్నింటిని పనివాళ్లను పెట్టి నాటిస్తున్నారు.
తన హరిత సంకల్పం కోసం గీతాంజలి ఇప్పటివరకు 8లక్షల రూపాయలు ఖర్చు చేశారు. పర్యావరణం పట్ల... ఆమె అంకితభావం చూసి పలు స్వచ్ఛంద సంస్థలు ఆహ్వానించినప్పటికీ.. సొంతంగానే మొక్కలు నాటాలని నిశ్చయించుకున్నారు.
ఇదీ చదవండి: కొత్త రూల్స్‌తో పార్లమెంట్లో మాక్ సెషన్