ETV Bharat / bharat

చైనా చొరబాట్లపై మోదీజీ నిజం చెప్పండి: రాహుల్ - రాహుల్​ గాంధీ వార్తలు

సరిహద్దులో చైనా చొరబాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ నిజాలు దాస్తున్నారని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ​ విమర్శించారు. అక్కడి భూభాగాన్ని లాక్కున్నారని స్థానికులు ఆరోపిస్తోన్న వీడియోలను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు రాహుల్​.

Ladakhis claim China has occupied Indian land, PM says otherwise, someone is lying: Rahul
చైనా చొరబాట్లపై మోదీ వాస్తవాలను వెల్లడించాలి: రాహుల్​
author img

By

Published : Jul 3, 2020, 4:21 PM IST

వాస్తవాధీన రేఖ వద్ద చొరబాట్లపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. తమ భూములను చైనా స్వాధీనం చేసుకుందని లద్దాఖ్​ ప్రజలు పేర్కొంటున్నారని.. నరేంద్ర మోదీ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారని ట్వీట్​ చేశారు. ఈ విషయంలో ఎవరు అబద్ధం చెబుతున్నారని రాహుల్ ప్రశ్నించారు​. సదరు వీడియోను ట్విట్టర్​ వేదికగా పంచుకొన్నారు రాహుల్​.

సరిహద్దు వద్ద ప్రతిష్టంభనలపై ప్రధాని మోదీ వాస్తవాలను దాస్తున్నారని ఆరోపించారు రాహుల్.

ఆకస్మిక పర్యటన..

భారత్​-చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ లద్దాఖ్​లో ఆకస్మిక ​ పర్యటన చేపట్టారు. నిము ప్రాంతంలో.. భారత సైన్యం, వాయుసేన, భారత్​- టిబెట్​ సరిహద్దు పోలీసు(ఐటీబీపీ) ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఇదీ చదవండి: లద్దాఖ్​​లో మోదీ పర్యటన.. సైనిక సన్నద్ధతపై సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.