కరోనా సంక్షోభ కాలంలో ఎంతోమంది చిత్రకారులు, కళాకారులు తమలోని ప్రతిభను బయటపెడుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. కేరళలోని తిరుర్కు చెందిన 78 ఏళ్ల సావియర్ చిత్రకూడం.. లాక్డౌన్ కష్టాలను తనదైన సృజనాత్మకతతో పెయింటింగ్స్గా మలిచారు.
మనసును హత్తుకునేలా..
మనుషుల జీవితాలను తన సొగసైన కళాఖండాల ద్వారా అభివర్ణిస్తున్నారు సావియర్. భావోద్వేగాలకు తన కుంచెతో రూపాన్నిస్తున్నారు. ఆకర్షణీయ రంగులతో పరిస్థితులను కళ్లకు కట్టేలా ప్రదర్శిస్తున్నారు. లాక్డౌన్లో ప్రజల దీనగాథలను.. తన కళతో ప్రపంచానికి చాటి చెబుతున్నారు. అందుకే ఆయన గీసిన చిత్రాలు చూపరులను కదలిస్తున్నాయి, లోతుగా ఆలోచింపజేస్తున్నాయి.
![Kerala: This artist showcases life during lockdown period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7194054_8.png)
![Kerala: This artist showcases life during lockdown period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7194054_3.png)
![Kerala: This artist showcases life during lockdown period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7194054_1.png)
ఆదరణ కరవై..
సావియర్ అభిరుచులకు ఎలాంటి దన్ను లభించకపోవడం వల్ల తన చిన్నతనంలోనే కుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. గత 22 ఏళ్లుగా తిరుర్లోనే చిత్రకారుడిగా పని చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఆయన గీసిన చిత్రాలను ప్రదర్శించడానికి వీలుకావడం లేదు. అందుకే పేపరుపైనే చిత్రాలు గీస్తున్నారు సావియర్. రోజువారీ వార్తలు, పలు కార్యక్రమాలే తన చిత్రాలకు ఆదర్శమని ఆయన చెబుతున్నారు.
![Kerala: This artist showcases life during lockdown period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7194054_9.png)
![Kerala: This artist showcases life during lockdown period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7194054_2.png)
![Kerala: This artist showcases life during lockdown period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7194054_7.png)
"ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కరోనాతో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ఇతర కార్మికులను ప్రశంసించడమే నా పని." - సావియర్, చిత్రకారుడు.
చిత్రాలను గీయడం నేర్చుకోవాలనే ఆసక్తి చూపించే యువతకు సావియర్ సలహాలు, సూచనలు ఇస్తూ... తన కళను పది మందికి పంచుతున్నారు.
![Kerala: This artist showcases life during lockdown period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7194054_10.png)
![Kerala: This artist showcases life during lockdown period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7194054_6.png)
![Kerala: This artist showcases life during lockdown period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7194054_5.png)
ఇదీ చూడండి: మాల్యాకు మరో షాక్- భారత్కు అప్పగింత ఖాయం!