ETV Bharat / bharat

ఆరేళ్ల బుడతడి 'స్విమ్మింగ్​' సందేశం - payyambalam

"స్విమ్మింగ్​ నేర్చుకోండి.. ప్రాణాలు రక్షించే దేవుళ్లు కండి" అంటున్నాడు కేరళకు చెందిన ఆరేళ్ల బుడతడు. ఈత ద్వారా స్వీయ రక్షణతో పాటు ఇతరులను కాపాడొచ్చని సందేశం ఇస్తున్నాడు.

6 years old swims in sea to raise awareness
స్విమ్మింగ్​ గురించి సందేశమిస్తున్న ఆరేళ్ల బాలుడు
author img

By

Published : Jan 25, 2021, 4:51 PM IST

ఈత నేర్చుకోవడం ద్వారా మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడొచ్చు.. అనే సందేశమిస్తున్నాడు కేరళ కన్నూర్​ జిల్లాకు చెందిన ఆరేళ్ల దరీస్​ ప్రభు. పయ్యంబాలం తీరంలోని సముద్ర జలాల్లో ఛార్ల్​సన్​ స్విమ్మింగ్​ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈత పోటీల్లో​ పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన చేశాడు ఈ బుడతడు. 'ఈత నేర్చుకోండి.. ప్రాణాలు రక్షించే దేవుళ్లు కండి' అంటూ స్విమ్మింగ్​ ప్రాధాన్యాన్ని చెప్పుకొచ్చాడు. జల ప్రమాదాలు జరిగినప్పుడు ఇతరులను కాపాడొచ్చని అభిప్రాయపడ్డాడు.

'ఈత నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. స్విమ్మింగ్​ వస్తే సొంతంగా రక్షణ పొందడమే కాకుండా.. తోటి వారి ప్రాణాలు కాపాడొచ్చు' అనే విషయాలను ప్రజలకు చేరువ చేయడానికి ఛార్ల్​సన్​ అకాడమీ ఈ పోటీలు నిర్వహిస్తుంది.

స్విమ్మింగ్​ గురించి సందేశమిస్తున్న ఆరేళ్ల బాలుడు

ఈ పోటీల్లో పాల్గొనడానికి ముందు దరీస్​ ఛార్ల్​సన్​ ఎజిమల వద్ద శిక్షణ తీసుకున్నాడు. అసాధారణ పరిస్థితుల్లోనూ సముద్రం లోతులో ఎవరినైనా రక్షించే విధంగా తయారయ్యాడు. ఈ ఉప్పు జలాల్లో వచ్చే అలలకు ఎదురీదుతూ 4 కి.మీ.లు ఈదిన ఘనత ఈ బాలుడి సొంతం. ఇటీవల పెరుంబా నదితో పాటు కవ్వాయ్​ వెనుక జలాల్లో స్విమ్​ చేశాడు. కవ్వాయ్​ జలాల్లో 20 నిమిషాల వ్యవధిలో ఒక కి.మీ. ఈది ఔరా అనిపించాడు.

కన్నూర్​లోని కతిరూర్​కు చెందిన విజయన్​ అనే 60 ఏళ్ల వృద్ధుడూ ఛార్ల్​సన్​ ఆధ్వర్యంలో స్విమ్మింగ్​ నేర్చుకున్నాడు. సదరు పోటీల్లో పాల్గొని ఈతకు వయసు అడ్డు కాదని నిరూపించాడు. వీరితో పాటు మరో ముగ్గురు స్విమ్మింగ్​లో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు.

ఇదీ చదవండి: 'రిమోట్​ ఓటింగ్​పై త్వరలో మాక్​ ట్రయల్స్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.