కోట్ల రూపాయల ఓబులాపురం మైనింగ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి (53) కరోనా బారినపడ్డారు. 2015 నుంచి.. షరతులతో కూడిన బెయిల్ మీదున్నారు రెడ్డి.
ఆదివారం బళ్లారిలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు... సుప్రీం నుంచి రెండు రోజుల పాటు అనుమతి పొందారు రెడ్డి. అయితే, కరోనాతో ఆసుపత్రిలో చేరడం వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నాని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
" రెడ్డి కరోనా సోకి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్షణాలు లేకుండా ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయినందున.. చికిత్సకు మెరుగ్గా స్పందిస్తున్నారు. "
-ఓ అధికారి
తన ప్రియతమ మిత్రుడు జనార్దన్ రెడ్డి వేగంగా కరోనా నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మంత్రి శ్రీరాములు. కరోనా బారిన పడి.. ఈ నెల 9నే కోలుకున్నారు శ్రీరాములు .
కరోనా కర్ణాటక!
కర్ణాటక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కరోనా బారినపడ్డట్టు ప్రకటించారు. భాజపా నేత మునిరత్న(57), జనతాదల్-ఎస్ మంత్రి హెచ్డీ రేవన్న, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు కొవిడ్-19 సోకినట్లు నిర్ధరణ అయ్యింది.
ఇప్పటివరకు కర్ణాటకలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సహా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య, రాష్ట్ర మంత్రులు ఎస్టీ సోమశేఖర్, సీటీ రవి సహా మరికొందరు ప్రజాప్రతినిధులు కొవిడ్ బారిన పడ్డారు.
ఇదీ చదవండి: కారు ఢీకొడితే ఎగిరి బైక్ కింద పడ్డాడు.. కానీ!