10 మంది కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కర్ణాటక యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ చాకో. వాళ్ల రాజీనామాలు పార్టీకి నష్టం కల్గించేలా ఉన్నాయని, ఫిరాయింపుల తరహాలో రాజీనామాల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. భారీ మొత్తంలో ధనం, ఇతర స్వార్థ ప్రయోజనాలకు ఆశపడే వారు రాజీనామా చేశారని పిటిషన్లో పేర్కొన్నారు చాకో.
చాకో వాదనలు వినేందుకు సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం అనుమతించింది.