ఆమెరికాలో భారత సంతతికి చెందిన న్యాయమూర్తికి అరుదైన ఘనత లభించింది. జస్టిస్ శ్రీ శ్రీనివాసన్ అనే జడ్జి ఫెడరల్ సర్క్యూట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 52 ఏళ్ల శ్రీ శ్రీనివాసన్ ఈ పదవిని చేపట్టిన తొలి ఇండో అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. అదే సమయంలో దక్షిణాసియా నుంచి ఈ పదవిని అలంకరించిన తొలివ్యక్తిగా నిలిచారు.
అంచలంచెలుగా ఎదుగుతూ..
ఫెడరల్ సర్క్యూట్ కోర్టును అమెరికా సుప్రీంకోర్టు తర్వాత అత్యంత శక్తివంతమైన న్యాయస్థానంగా పేర్కొంటారు. ఛండీగఢ్‌లో జన్మించిన శ్రీనివాసన్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టాపొందారు. స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ విద్యను అభ్యసించారు. గతంలో యూఎస్ ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. అనంతరం యూఎస్ అప్పీళ్లకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు.
ఇదీ చూడండి:'యువత భవితను మోదీ-షా నాశనం చేశారు'