ETV Bharat / bharat

అరుణ్​ జైట్లీకి భారతావని కన్నీటి వీడ్కోలు

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్​ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం దిల్లీలోని నిగంబోధ్​ ఘాట్​లో జరిగాయి. తీవ్ర ఆనారోగ్యంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు జైట్లీ. ఆయన భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు ఎందరో నేతలు, అభిమానలు జైట్లీ నివాసానికి, భాజపా ప్రధాన కార్యాలయానికి తరలివెళ్లారు.

అరుణ్​ జైట్లీకి భారతావని కన్నీటి వీడ్కోలు
author img

By

Published : Aug 25, 2019, 3:31 PM IST

Updated : Sep 28, 2019, 5:28 AM IST

అరుణ్​ జైట్లీకి భారతావని కన్నీటి వీడ్కోలు

కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి అరుణ్​ జైట్లీ​ అంత్యక్రియలు దిల్లీలో ఆదివారం అధికార లాంఛనాలతో జరిగాయి. యమునా నది తీరం వద్ద ఉన్న నిగంబోధ్​ ఘాట్​లో జరిగిన అంతిమ సంస్కారాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణమంత్రి రాజ్​నాథ్​ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

శ్వాస సంబంధిత సమస్యతో ఈనెల 9న దిల్లీలోని ఎయిమ్స్​ ఆసుపత్రిలో చేరారు జైట్లీ. శనివారం ఆరోగ్యం క్షీణించి 66ఏళ్ల జైట్లీ తుదిశ్వాస విడిచారు. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి మరణం పట్ల రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని మోదీతో పాటు అనేక మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి జైట్లీ చేసిన సేవలను స్మరించుకున్నారు.

జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్​ నుంచి శనివారం కైలాష్​నగర్​లోని ఆయన నివాసానికి తరలించారు. పార్టీలకు అతీతంగా అనేక మంది అగ్రనేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జైట్లీ పార్థివదేహాన్ని దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షా, రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అనేక మంది ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు... జైట్లీకి నివాళులర్పించడానికి తరలివెళ్లారు.

మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు జైట్లీ అంతిమయాత్ర ప్రారంభమైంది. 2 గంటల 30 నిమిషాలకు నిగంబోధ్​ ఘాట్​లో అంత్యక్రియలు జరిగాయి.

ప్రధాని దూరం...

జైట్లీ మృతి పట్ల ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోదీ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల జైట్లీకి ప్రత్యక్షంగా తుది వీడ్కోలు పలకడం సాధ్యపడలేదు.

ఇవీ చదవండి:-

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
HOST BROADCASTER - AP CLIENTS ONLY
Biarritz - 25 August 2019
1. Various of Group of Seven leaders - UK Prime Minister Boris Johnson, European Union Council President Donald Tusk, Italy's caretaker leader Guiseppe Conte, Japanese Prime Minister Shinzo Abe, US President Donald Trump, French President Emmanuel Macron, German Chancellor Angela Merkel and Canadian Prime Minister Justin Trudeau - at start of working session on strategy, security and international economy
STORYLINE:
The leaders of the Group of Seven gathered in Biarritz, France, for a working session on Sunday to discuss security and the world economy.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 28, 2019, 5:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.