పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. సభాపక్ష నేత సహా.. వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లకు మాట్లాడే అవకాశం కల్పించారు.
జైట్లీ తనకు మంచి స్నేహితుడని చెప్పారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్. జైట్లీపై ప్రశంసల జల్లు కురిపించారు. జైట్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే సమయంలో ఆజాద్ భావోద్వేగానికి లోనయ్యారు.
"అరుణ్‌జైట్లీ... నేను రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నప్పుడు సభాపక్షనేతగా పనిచేశారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన రాజ్యసభలో విపక్షనేతగా వ్యవహరించారు. వివిధ అంశాలపై చర్చ జరుగుతూ సభలో వాడీవేడి వాతావరణం నెలకొన్నప్పుడు ఆయన లేచి తన చాతుర్యంతో సభను శాంతపరిచేవారు. అరుణ్‌జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను."
-గులాం నబీ ఆజాద్, రాజ్యసభలో విపక్ష నేత
ఇదీ చూడండి: 'ప్రకృతి' కోసం పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన ఎంపీ