పశుదాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్.. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. ఆయన ఈ బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 11వ సారి.
లాలూ తనయులు.. తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ఆయన నామినేషన్ పత్రాలను పట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో సమర్పించారు. అనంతరం అధ్యక్ష పదవికి లాలూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రకటించింది.
1997లో ఆర్జేడీ పార్టీని స్థాపించారు లాలూ ప్రసాద్ యాదవ్.