ETV Bharat / bharat

అభివృద్ధి పథంలో 'ఇస్రో' కీలక ఒప్పందం

author img

By

Published : Jun 6, 2020, 2:41 PM IST

అంతరిక్ష పరిస్థితులపై సమగ్ర అవగాహన కోసం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఆర్​ఐఈఎస్​తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది.

ISRO signs MoU with ARIES for cooperation in Space Situational
అభివృద్ధి పథంలో ఇస్రో కీలక ఒప్పందం

అంతరిక్ష పరిస్థితులపై అవగాహన, ఖగోళ భౌతిక శాస్త్ర అంశాలపై సహకారం కోసం భారత 'అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)' కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 'ఆర్యభట్ట రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ అబ్జర్వేషనల్​ సైన్సెస్​(ఏఆర్​ఐఈఎస్​)'తో పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది.

ఉత్తరాఖండ్​- నైనిటాల్​లో ఈ నెల 4న జరిగిన వీడియో సమావేశంలో ఇరు సంస్థలూ పాల్గొన్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా.. ఇస్రో సైంటిఫిక్​ సెక్రటరీ ఆర్​ ఉమా మహేశ్వరన్​, ఏఆర్​ఐఈఎస్ డైరెక్టర్​ దీపాంకర్​ బెనర్జీలు సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. ఈ రెండు సంస్థల పరస్పర సహకారంతో రానున్న కాలంలో ఆర్బిటాల్​ ట్రాకింగ్​, వాతావరణ అధ్యయనా అంశాలపై కచ్చితమైన అవగాహన వస్తుందని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: 'మట్టి'ని తయారు చేసిన ఇస్రో.. పేటెంట్‌ హక్కు సొంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.