మరో 11 రోజుల్లో చంద్రయాన్-2 జాబిల్లిపై దిగనుంది. ఈ నేపథ్యంలో మరో కీలక ఘట్టాన్ని విజయవంతంగా అధిగమించింది. చంద్రుడి మూడవ కక్ష్యలోకి ఈ ఉదయం చోదక వ్యవస్థ ద్వారా చంద్రయాన్-2 చంద్రుడి మూడవ కక్ష్యలోకి ప్రవేశించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఉదయం 9.04 నిమిషాలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ 11 వందల 90 సెకన్ల పాటు సాగినట్లు వివరించింది.
ఆగస్టు 21న జాబిల్లి రెండవ కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం చంద్రయాన్ తీసిన రెండు ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. చంద్రుడి ధృవాలను కలుపుతూ ఉండే చివరి కక్ష్యను దాటుకుని జాబిల్లిపై అడుగుపెట్టే లోపు చంద్రయాన్-2 మరో రెండు సార్లు కక్ష్యలను దాటనున్నట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.
సెప్టెంబర్ 2న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి.. 100X30 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అనంతరం సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధృవంపై దిగనుంది. చంద్రయాన్-2 జాబిల్లిపై దిగిన తర్వాత ల్యాండర్ విక్రమ్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకొచ్చి అక్కడ పరిశోధనలు చేస్తుంది. ఈ రోవర్ విక్రమ్‌కు సమాచారం అందిస్తుంది.