ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి దిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి తిహార్ జైల్లో విచారణ మొదలుకానుంది. అవసరమైతే అరెస్ట్ చేయొచ్చని దిల్లీ కోర్టు తెలిపింది.
సీబీఐ అవమానించాలని భావిస్తోంది
మరోవైపు ఇదే కేసులో బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. చిదంబరానికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి వాదించారు.
చిదంబరాన్ని కస్టడీలో ఉంచుకొని అవమానించాలని సీబీఐ భావిస్తోందన్నారు. ఈ విషయంపై సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రేపు సీబీఐ తరఫున వాదనలు వినిపించనున్నారు.
ఇదీ చూడండి: 'కీలక ఘట్టం పూర్తి- సెప్టెంబర్ 7న ల్యాండింగ్'