ETV Bharat / bharat

ఆ ఇస్లాం యువకుడు ఇప్పుడు హిందూ సద్గురు! - Sadguru Nijalinga Swamiji is a muslim

ఇస్లాం మతంలో పుట్టిపెరిగిన ఓ యువకుడు ఇప్పుడు హిందూ సిద్ధాంతాలను ఒంటబట్టించుకున్నాడు. విశ్వగురు బసవన్న వేదాంతాలను మెచ్చి.. లింగ దీక్ష చేపట్టాడు. ఇప్పుడు 'సద్గురు నిజలింగ స్వామీజీ'గా మారిపోయాడు.

Influenced by Vishvaguru Basavanna: The Muslim youth become 'Sadguru Nijalinga Swamiji'
ఇస్లాం యువకుడు ఇప్పుడు హిందూ సద్గురు!
author img

By

Published : Aug 17, 2020, 6:07 PM IST

మతం కన్నా లోకకల్యాణ సిద్ధాంతాలే గొప్పవి అంటున్నాడు కర్ణాటక బీదర్ జిల్లాలో ఓ యువకుడు. ముస్లిం కుటుంబంలో పుట్టి పెరిగినా.. విశ్వగురు బసవన్నను స్ఫూర్తిగా తీసుకున్నాడు నిసార్. బసవన్న బోధించిన శాంతి, సమానత్వం, అహింసా సిద్ధాంతాలనే బలంగా నమ్మాడు. ఆయన బాటలో నడిచేందుకు కఠిన దీక్షలు చేపట్టి.. ఇప్పుడు నిసార్ కాస్తా 'సద్గురు నిజలింగ స్వామీజీ' అయిపోయాడు.

Influenced by Vishvaguru Basavanna: The Muslim youth become 'Sadguru Nijalinga Swamiji'
ఇస్లాం యువకుడు ఇప్పుడు హిందూ సద్గురు!

నిసార్ గత మూడేళ్లుగా బసవ తత్వాన్ని చదువుతున్నాడు. బసవ ధర్మ పీఠ చైర్మన్ డాక్టర్. మాతే గంగాదేవీ బోధించే బసవ సిద్ధాంతాలను మొబైల్లోనే నేర్చుకున్నాడు. చిన్నవయసులోనే బోలేడంత జ్ఞానాన్ని మూటగట్టుకున్నాడు. బసవప్రభు చేతుల మీదుగా, బసవ మహామానేలో కొన్నేళ్ల క్రితమే లింగ దీక్ష తీసుకున్నాడు నిసార్. ఆగస్టు 15న, 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. అధికారికంగా బసవ సిద్ధాంతాలకు శిష్యుడయ్యాడు. ఇక తన జీవితం లోక కల్యాణానికే అంకితమంటున్నాడు.

ఇదీ చదవండి: నూడుల్స్ బండి కరెంట్ బిల్ రూ.1.82 కోట్లు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.