భారత్- పాకిస్థాన్ మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న జల వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. వివాదం తెరదించేందుకు చేపట్టాల్సిన చర్చల వేదికపై ఇరు దేశాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు ఇందుకు కారణం. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆన్లైన్లో చర్చలు జరపాలని భారత్ చెబుతుండగా.. అట్టారీ చెక్పోస్టు వద్ద సమావేశమవుదామని పాక్ పట్టుబడుతోంది.
నిజానికి పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఈ ఏడాది మార్చిలో ఇరు దేశాలు భేటీకావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో సమవేశం వాయిదా పడింది.
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు వీలుకాకపోవడం వల్ల.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించాలని జులై మొదటి వారంలో భారత కమిషనర్ పాక్ను కోరారు. వర్చువల్ విధానాల్లో జరుగుతున్న అంతర్జాతీయ సమావేశాలను ఇందుకు ఉదాహరణగా చూపించారు. జులై చివరి వారంలో పాక్ బదులిచ్చింది. ఆన్లైన్ వద్దని.. అట్టారీ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద భేటీ అవుదామని పాక్కమిషనర్ ప్రతిపాదించారు.
కిషెన్గంగా, రాట్లె హైడ్రో విద్యుత్ ప్రాజెక్టుల అంశంలో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సమస్యలు ఉన్నాయి.
ఇదీ చూడండి:- 'భారత్- పాక్ జల వివాదంపై ఏ నిర్ణయం తీసుకోలేం!'