మధ్యప్రదేశ్లో కొందరు వ్యాపారవేత్తలు ఖరీదైన, విలాసవంతమైన కార్లను వదిలి... ఎడ్లబండెక్కారు. ఇందోర్ పల్డాకు చెందిన ఆ వ్యాపారవేత్తలు.. అధ్వాన్నంగా మారిన రోడ్లను పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఇలా నిరసన వ్యక్తం చేశారు.
ఎటు చూసినా గుంతలు, నీరు చేరుకుని దారుణంగా తయారైన రోడ్ల గురించి... తొమ్మిదేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవట్లేదని వాపోయారు వ్యాపారులు. మట్టి రోడ్డును తలపిస్తున్న ఈ మార్గంలో కార్లు నడవవనీ, ఎడ్లబండ్లు మాత్రమే నడుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం సత్వర చర్యలు తీసకుని పల్డా మార్గంలో కొత్త రోడ్లు వేయించాలని కోరుతూ.. ఇలా ఎడ్లబండిపై కంపెనీలకు బయల్దేరారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి:ఏనుగే ఆ బాంబు ఉన్న పండును ఆరగించిందా?