దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 74,383 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 918 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
ఫలితంగా దేశంలో మొత్తం కేసుల 70,53,807కు చేరింది. మరణాల సంఖ్య 1,08,334కు పెరిగింది. ప్రస్తుతం 8,67,496 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు.. కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరో 89,154 మంది బాధితులు వైరస్ నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఫలితంగా రికవరీల సంఖ్య 60,77,976కు చేరింది. రికవరీ రేటు ప్రస్తుతం 86.17 శాతంగా ఉంది. అదేసమయంలో మరణాల రేటు 1.54 శాతానికి చేరుకుంది.
శనివారం ఒక్కరోజే 10,78,544 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. అక్టోబర్ 10నాటికి దేశంలో 8,68,77,242 కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగినట్లు వెల్లడించింది.