భారత్లో కొవిడ్ రికవరీ రేటు గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. జూన్ 18న 53 శాతంగా ఉన్న రికవరీ రేటు.. మంగళవారం నాటికి 64.24 శాతానికి ఎగబాకిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
మహమ్మారి బారినపడిన వారి సంఖ్య అధికమవుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. జూన్ మధ్య కాలంలో 3.33 శాతంగా కరోనా మరణాల రేటు.. క్రమంగా తగ్గుతూ 2.25 కు చేరిందని స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ.
దేశవ్యాప్తంగా వరుసగా ఐదోరోజూ రికార్డు స్థాయిలో 30 వేల మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం ఒక్కరోజే 35,176 మంది బాధితులు.. వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 9,52,743 కు చేరింది. మరో 4.5 లక్షల మందికిపైగా కరోనా రోగులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: దేశంలో కొత్తగా 47,704కేసులు.. 654 మరణాలు