భారత్, ఫ్రాన్స్ వాయుసేనలు కలిసి నాలుగు రోజుల పాటు నిర్వహించిన మెగా డ్రిల్ శనివారం ముగిసింది. 'ఎక్స్ డిజర్ట్ నైట్' పేరిట జోధ్‌పుర్‌లో ఈ విన్యాసాలు జరిగాయి. ఇందులో భారత్, ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ విమానాలు పాల్గొని, కఠినమైన విన్యాసాలను ప్రదర్శించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మిరాజ్, సుఖోయ్ విమానాలతో పాటు, గగనతల హెచ్చరిక వ్యవస్థ, ఐఎల్-78 ఫ్లైట్ రీఫ్యూయెలింగ్ విమానం సైతం విన్యాసాల్లో పాల్గొన్నాయని పేర్కొంది.
-
#SaturdaySpecial
— Indian Air Force (@IAF_MCC) January 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Somewhere between heaven and earth,
The lethal birds quench their thirst!#IndoFrenchEx#DesertKnight21 @Armee_de_lair pic.twitter.com/rccbdsB8Lz
">#SaturdaySpecial
— Indian Air Force (@IAF_MCC) January 23, 2021
Somewhere between heaven and earth,
The lethal birds quench their thirst!#IndoFrenchEx#DesertKnight21 @Armee_de_lair pic.twitter.com/rccbdsB8Lz#SaturdaySpecial
— Indian Air Force (@IAF_MCC) January 23, 2021
Somewhere between heaven and earth,
The lethal birds quench their thirst!#IndoFrenchEx#DesertKnight21 @Armee_de_lair pic.twitter.com/rccbdsB8Lz

"రఫేల్‌తో పాటు, సు-30 ఎంకేఐ, మిరాజ్ 2000 ఎయిర్‌క్రాఫ్ట్‌లు పలు కఠినమైన విన్యాసాలను చేపట్టాయి. కార్యాచరణ సామర్థ్యాలు మెరుగుపపర్చడం, ఇంటరాపరేబిలిటీని పెంచే లక్ష్యంతో ఇరుదేశాల వాయుసేనలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. వాయుసేనలు పాటించే ఉత్తమ పద్ధతులను ఒకరినొకరితో పంచుకునేందుకు విన్యాసాలు ఉపయోగపడతాయి."
-రక్షణ శాఖ ప్రకటన
నాలుగు రోజుల పాటు సాగిన ఈ విన్యాసాలను ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా పరిశీలించారు. భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి సైతం భదౌరియాతో కలిసి శనివారం జోధ్‌పుర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించారు.
