ETV Bharat / bharat

ఆ 14 దేశాలే లక్ష్యంగా ఆయుధ ఎగుమతులు

ప్రపంచంలోని 14 దేశాలకు ఆయుధ ఉత్పత్తులను ఎగుమతి చేయాని లక్ష్యంగా పెట్టుకుంది భారత్​. 'ఆత్మనిర్భర్​ భారత్'​ కింద దేశంలో ఆయుధ ఉత్పత్తిని సాగించటమే కాకుండా విదేశాలకూ వాటిని ఎగుమతి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన నేపథ్యంలోఈ నిర్ణయం తీసుకుంది అధికార యంత్రాంగం. ఈ 14 దేశాల్లో ఆసియా, పశ్చిమాసియాలోని మిత్ర దేశాలు ఉన్నాయి.

India sets sight on 14 Asian nations for weapons exports
ఆయుధ ఎగుమతుల్లో ఆ 14 దేశాలే లక్ష్యం
author img

By

Published : Aug 29, 2020, 9:50 AM IST

'ఆత్మనిర్భర్​ భారత్'​ కింద దేశంలో ఆయుధ ఉత్పత్తిని సాగించటమే కాకుండా విదేశాలకూ వాటిని ఎగుమతి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన నేపథ్యంలో ఈ అంశంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. రక్షణ ఉపకరణాల ఎగుమతికి అవకాశాలున్న దేశాల జాబితాను సిద్ధం చేస్తోంది. 14 దేశాల్లో ఇందుకు అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది.

'సిప్రీ' తాజా గణాంకాల ప్రకారం సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్​ ఉంది. దీనికి భిన్నంగా ప్రధాన ఆయుధ ఎగుమతి దేశంగా ఎదగాలన్నది మోదీ ప్రభుత్వ వ్యూహం. 'మేకిన్​ ఇన్​ ఇండియా' కూడా ఇదే లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. ప్రస్తుతం ఆయుధ ఎగుమతుల విషయంలో మన దేశం 23వ స్థానంలో ఉంది. మారిషస్, మయన్నార్​, శ్రీలంకలే మన ప్రధాన కస్టమర్లు. ఈ పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. 2025 నాటికి రూ. 35 వేల కోట్ల ఆయుధ ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తద్వారా వచ్చే ఇదేళ్లలో ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి ఆయుధ ఎగుమతి దేశాల్లో స్థానం సంపాదించాలని భావిస్తోంది. "మన సైనిక సామాగ్రిని కొనుగోలు చేసే వీలున్న 14 దేశాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేశాం. ఇవన్నీ ఆసియా, పశ్చిమాసియాలో ఉన్న మిత్ర దేశాలే" అని ఓ ఉన్నతాధికారి 'ఈటీవీ భారత్​'కు తెలిపారు. ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో పని చేసే మన సైనిక అటాచీల ద్వారా అక్కడి అవసరాలను గుర్తించనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి రాజ్​కుమార్​ ఇటీవల జరిగిన ఒక సదస్సులో చెప్పారు. 'భారత్​లో తయారీ' నుంచి 'ప్రపంచం కోసం తయారీ' మార్గం వైపు వెళ్లాలన్నదే లక్ష్యమని వివరించారు.

గతంలో విదేశీ ఆయుధ తయారీ సంస్థల నుంచి లైసెన్సులు తెచ్చుకొని దేశంలో ఆయుధ ఉత్పత్తిని భారత్​ చేపట్టేది. అయితే జాయింట్​ వెంచర్ల ద్వారా ఉమ్మడిగా దేశంలోనే ఉత్పత్తి చేసే విధానం వైపు మళ్లుతోంది. ఈ దిశగా ఇప్పుడు రక్షణ ఉత్పాదన, ఎగుమతి ప్రోత్సాహక ముసాయిదా విధానం (డీపీఈపీ)-2020ని రక్షణ మంత్రిత్వశాఖ సిద్ధం చేసింది.

ఎగుమతికి అవకాశమున్న ఆయుధాలివే..

దేశీయంగా రూపొందిన రాడార్లు, తుపాకులు, మందుగుండు సామాగ్రి తదితరాల ఎగుమతులపై ప్రధానంగా భారత్​ దృష్టి సారించింది. అలాగే బ్రహ్మోస్​ సూపర్​ సోనిక్​ క్రూయిజ్​ క్షిపణులకూ విక్రయించాలనుకుంటోంది. అయితే రష్యాతో ఉమ్మడిగా ఈ అస్త్రాన్ని అభివృద్ధి చేసినందువల్ల దీనిపై ఆ దేశంతో కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ప్రస్తుతం రూ.80వేల కోట్లు..

గతంలో భారత్ రక్షణ ఉత్పాదనను ప్రధానంగా ప్రభుత్వ ఆయుధ కర్మాగారాలు, రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు (డీపీఎస్​యూ) చేపట్టేవి. 2001 నుంచి ప్రైవేటు రంగ కంపెనీలకూ ఆయుధ తయారీ కోసం ప్రభుత్వం లైసెస్సులు ఇచ్చింది. ఫలితంగా అనేక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ట్యాంకులు, సాయుధ శకటాలు, భారీ వాహనాలు, యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, యుద్ధనౌకలు, జలాంతర్గాయులు, క్షిపణులు ఎలక్ట్రానిక్​ సాధనాలను భారత్​ ఉత్పత్తి చేయగలిగింది. 2019-20లో భారత రక్షణ పరిశ్రమ పరిమాణం రూ.80 వేల కోట్లుగా ఉంది. ఇందులో ప్రభుత్వ రంగ వాటా రూ. 63 వేల కోట్లు, ప్రైవేటు వాటా రూ. 17 వేల కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.