ETV Bharat / bharat

ప్రకటనలే అసలు సమస్య - తెలంగాణ

రైతుల పత్తి విత్తన ఎంపికను ప్రకటనలే ప్రభావితం చేస్తున్నాయని అమెరికన్​ ఆంత్రోపాలజీ అనే జర్నల్​లో ప్రచురితమైన ఓ సర్వే వెల్లడించింది.

పత్తి విత్తన ఎంపిక భారమే
author img

By

Published : Mar 2, 2019, 5:13 PM IST

రైతుల పత్తి విత్తన ఎంపికలో ప్రకటనల ప్రభావమే పూర్తిగా ఉంటోందని అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ఆండ్రూ ఫ్లాచ్స్​ అనే పరిశోధకుడు తెలంగాణలో చేసిన సర్వే అమెరికన్ ఆంత్రోపాలజీ అనే జర్నల్​లో ప్రచురితమైంది.

పత్తి ఉత్పత్తికితెలంగాణప్రధాన కేంద్రం. ఈ ప్రాంతంలో చిన్న రైతులే దీన్ని ఎక్కువగా సాగు చేస్తారు. ఇక్కడే 90వ దశకంలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. జన్యుమార్పిడి విత్తనాలతో వీటిని నివారించవచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.

ఎంత మంది ఏ విత్తనాలను ఎంచుకుంటున్నారో తెలుసుకోవటానికి ఫ్లాచ్స్​ 2012 నుంచి 2018 మధ్య గ్రామాల్లో నివసిస్తూ సర్వే చేశారు. జన్యుమార్పిడి విత్తనాలతో రైతుల అనుభాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ సంస్థల సలహాలు రైతులకు అందుబాటులో లేకపోవటం వల్ల వారికి తోచిన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారని సర్వే తెలిపింది.

2008లో తెలంగాణలో చాలా మంది రైతులు ఒకే రకానికి చెందిన విత్తనాలను వేశారు. అందులో కొన్ని అయితే సాగైన భూమిలో సగం వరకు ఉన్నాయి. తరువాతి సంవత్సరంలో మంచి దిగుబడి వస్తుందన్న ఆశతో కొత్త విత్తనానికి మారారు.

సర్వే సమయంలో అత్యంత ప్రజా ప్రాముఖ్యం ఉన్న ఆరు విత్తనాల దిగుబడి సాధారణ స్థాయిలోనే ఉంది. వాతావరణం, నీరు, చీడపురుగుల లాంటి కారణాల వల్ల పూర్తి దిగుబడి సామర్థ్యాన్ని అందుకోలేకపోతున్నారు రైతులు.

కొత్త విత్తనాలు మార్కెట్లోకి వచ్చే వేగాన్ని తగ్గించటమే రైతులకు ప్రభుత్వం చేసే అతిపెద్ద సహాయం అవుతుందని ఫ్లాచ్స్ అభిప్రాయపడ్డారు​. భారత పత్తి రైతులకు సాగునీరు, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించి జీవన నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉంది.

undefined

ఎంపిక భారమే....

భారత ప్రభుత్వం 1990 ఆర్థిక సంస్కరణల అనంతరం ఎరువులు, పురుగుల మందులు, నీరు, విత్తనాలపై సబ్సిడీలను తగ్గించింది. ప్రభుత్వ సంస్థల వ్యవసాయ ఉత్పత్తుల దుకాణాలు ప్రైవేటు బ్రాండ్లతో నిండిపోయాయి.

" ఏదైనా దుకాణంలోకి వెళ్లినప్పుడు ఒకే ఉత్పత్తికి చెందిన చాలా రకాల బ్రాండ్లు ఉంటున్నాయి. వీటిలో ఒకటి ఎంపిక చేసుకోవటం కష్టమే. దీనినే శాస్త్రవేత్తలు ఎంపిక భారం అంటారు. జన్యుమార్పిడి విత్తనాలను ప్రవేశపెట్టినప్పుడు మూడు రకాల బ్రాండ్లే ఉండేవి. ప్రస్తుతం 1200 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. ఇందులో నుంచి మంచి రకాన్ని ఎంచుకోవటం చాలా కష్టం."

- ఆండ్రూ ఫ్లాచ్స్, పర్డ్యూ విశ్వవిద్యాలయంలో పర్యావరణ శాస్త్రవేత్త

ప్రస్తుతం జన్యుమార్పిడి విత్తనాలు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. ఇవి వాస్తవానికి దిగుబడిని పెంచాలి. కానీ దేశవ్యాప్తంగా దిగుబడి తగ్గిపోయింది. గత దశాబ్దంలో ఎరువుల వాడకం పెరిగింది.

Mumbai, Mar 02 (ANI): Bollywood actress Raveena Tandon joined 'Save the beach' movement at Juhu beach in Mumbai. Several Mumbaikars came together to join Raveena for beach cleanup and awareness campaigning. The aim of the initiative is to protect Juhu beach from littering and waste disposal. The actress also inaugurated a unique art installation made from wastes. Around 4000 plastic bottles and other waste materials were used to make the installation. At least 14000 volunteers and more than 90 organisations have taken part in this drive.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.