ETV Bharat / bharat

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్​లో పెరిగిన ఉగ్రవాదం! - Jammu and Kashmir is witnessing a rise in the militancy related incidents

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్​లో ఉగ్ర సంబంధిత ఘటనలు 9.6 శాతం పెరిగినట్లు గణాంకాల్లో తేలింది. ఈ ఘటనల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 11.30 శాతం, పౌరుల మరణాలు 1.52 శాతం పెరిగాయి. కాగా.. భద్రతా దళాల మరణాలు ఏకంగా 25.42 శాతం తగ్గుముఖం పట్టాయి.

In last 26 months, J&K saw 9.6% rise in militancy-related incidents
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ములో పెరిగిన ఉగ్రవాదం!
author img

By

Published : Oct 3, 2020, 5:53 PM IST

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉగ్రవాద సంబంధిత ఘటనలు పెరిగిపోతున్నాయి. జమ్ము కశ్మీర్ పోలీసుల గణాంకాల ప్రకారం 2018 ఆగస్టు 5 నుంచి 2020 సెప్టెంబర్ 30 నాటికి ఉగ్ర ఘటనలు 9.6 శాతం పెరిగాయి. అదే సమయంలో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 11.30 శాతం పెరిగింది.

"2018 ఆగస్టు నుంచి 2019 సెప్టెంబర్ మధ్య 198 ఉగ్ర సంబంధిత ఘటనలు జరిగాయి. ఇందులో 292 మంది ఉగ్రవాదులు, 118 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 66 మంది పౌరులు మరణించారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో 217 ఉగ్ర సంబంధిత ఘటనలు జరిగాయి. ఇందులో 325 మంది ఉగ్రవాదులు, 88 మంది భద్రతా సిబ్బంది, 67 మంది పౌరులు ప్రాణాలు విడిచారు."

-జమ్ము కశ్మీర్ పోలీసు శాఖ గణాంకాలు

గతంతో పోలిస్తే పౌరుల మరణాలు 1.52 శాతం పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే భద్రతా దళాల మరణాలు మాత్రం 25.42 శాతం తగ్గుముఖం పట్టాయి.

కారణమిదే!

జమ్ము కశ్మీర్​లో ముష్కరులకు వ్యతిరేక చేపట్టిన ఆపరేషన్ల సంఖ్య పెరగడం వల్లే ఉగ్ర ఘటనల్లో పెరుగుదలకు కారణమని ఆ ప్రాంత సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులు సరిహద్దుల వెంట ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భారీగా చేరవేశారని, దానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ల ఫలితమే ఈ గణాంకాలు అని స్పష్టం చేశారు.

అయితే పౌరులు ఈ ఘటనల్లో మరణించడం దురదృష్టకరమని అన్నారు. కాల్పులు జరిగిన సమయంలో లేదా పేలుళ్లు సంభవించినప్పుడు వీరు మరణిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి- పట్టపగ్గాల్లేని 'సైబర్'‌ నేరాలను అరికట్టేదెలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.