ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ)ల్లో చదివే విద్యార్థులకు తీపి కబురు అందించింది కేంద్రం. ఈ ప్రతిష్టాత్మక సంస్థల్లో 2020-21 విద్యాసంవత్సరానికిగానూ ఏ కోర్సుకూ ట్యూషన్ ఫీజు పెంచేది లేదని స్పష్టం చేశారు కేంద్ర మానవవనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.
"ఐఐటీ కౌన్సిల్ స్టాండర్డ్ కమిటీ ఛైర్మన్, ఐఐటీల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపిన తర్వాత 2020-21 అకడమిక్ ఇయర్లో ఏ కోర్సుకూ ట్యూషన్ ఫీజు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నాయి."
-రమేశ్ పోఖ్రియాల్ కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి.
అదే విధంగా ఐఐఐటీల్లో కూడా కేంద్రం నిధులతో చదివే వారికి, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో చేరిన వారికి ఏటా పెంచే 10 శాతం ఫీజును కూడా పెంచకూడదని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇతర కోర్సుల ఫీజులు కూడా పెంచకూడదని వారిని కోరినట్లు వెల్లడించారు పోఖ్రియాల్.