ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు, చట్టాలు సహా పలు విషయాలపై దేశ పౌరులు సమాచారం తెలసుకునేందుకు రూపొందించిందే సమాచార హక్కు చట్టం. ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అయితే బిల్లులో ప్రతిపాదించిన సవరణలపై సభలో విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచార కమిషనర్ల అధికారాలను ఈ బిల్లు హరిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఆర్టీఐ వ్యవస్థను బలహీన పరిచేందుకే ఇలాంటి సవరణలు ప్రతిపాదించారని కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ ఆరోపించారు.
"ఈ ఆర్టీఐ సవరణ.. చట్ట రూపాన్ని బలహీనపరిచేందుకు ఓ ప్రయత్నం. మానవ హక్కుల కమిషన్లానే ఆర్టీఐను కూడా కోరలు లేని పులిలా తయారు చేస్తున్నారు. ఇది కేవలం ఆర్టీఐ సవరణ బిల్లు కాదు... ఆర్టీఐను భూస్థాపితం చేసే బిల్లు."
- శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ
రాజ్యసభలో...
మానవ హక్కుల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఉన్న చట్టంలోని కీలక అంశాలను సవరిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు విపక్షాలు అభ్యంతరం తెలిపినా సభ అంగీకారం తెలిపింది.
బిల్లులోని అంశాలు..
- మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి మూడేళ్లకు కుదింపు
- కమిషన్ ఛైర్మన్గా భారత విశ్రాంత ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీం విశ్రాంత న్యాయమూర్తులనూ నియమించవచ్చు.
- రాష్ట్రాల కమిషన్లోనూ హైకోర్టు న్యాయమూర్తులను నియమించవచ్చు.
- కమిషన్లో సభ్యుల సంఖ్య పెంపు
- ఇదీ చూడండి: వర్షాకాల సమావేశాల పొడిగింపునకు విపక్షాలు 'నో'!