ETV Bharat / bharat

'దేశ సార్వభౌమత్వం పరిరక్షణకు వాయుసేన సిద్ధం'

author img

By

Published : Oct 8, 2020, 12:32 PM IST

Updated : Oct 8, 2020, 12:52 PM IST

దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించేందుకు వైమానిక దళం సర్వసన్నద్ధమని తెలిపారు ఐఏఎఫ్​ చీఫ్​ ఆర్​కేఎస్ భదౌరియా. భారత వాయుసేన 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రసంగించారు. శత్రువుకు దీటుగా బదులిచ్చే సత్తా తమకుందని స్పష్టం చేశారు.

IAF will evolve, ready to safeguard India's sovereignty and interests: RKS Bhadauria
'దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు వాయుసేన సిద్ధం'

భారత వాయుసేన తన సంకల్పం, శక్తి సామర్థ్యాలు, కార్యాచరణను ప్రదర్శించిందని తెలిపారు ఐఏఎఫ్​ ఛీప్​ ఆర్​కేఎస్ భదౌరియా. అవసరమైనప్పుడు శత్రువుకు తగిన రీతిలో బుద్ధి చెప్పే సత్తా ఉందని తూర్పు లద్దాఖ్​లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్​లో పాల్గొన్నారు వాయుసేన అధిపతి. ఇటీవల సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు వాయుసేన చురుగ్గా స్పందించిన తీరుకు అభినందనలు తెలిపారు. తూర్పు లద్దాఖ్​లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యానికి అతి తక్కువ సమయంలోనే సాయం అదించి యుద్ధ సన్నద్ధతకు సహకరించడంపై ప్రశంసలు కురిపించారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించేందుకు వైమానిక దళం సిద్ధమని స్పష్టం చేశారు.

అట్టహాసంగా..

భారత వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఘజియాబాద్‌ 'హిండన్‌ ఎయిర్‌స్టేషన్'‌లో వేడుకలు జరిగాయి. ఎయిర్‌ఫోర్స్‌డేను పురస్కరించుకుని వైమానిక దళం పరేడ్‌ నిర్వహించింది. దీనిలో వాయుసేనకు చెందిన 56 విమానాలు పాల్గొన్నాయి. తేజస్‌, జాగ్వర్‌, సుఖోయ్‌ సహా 19 యుద్ధ విమానాలు, 19 హెలికాప్టర్లు వీటిలో ఉన్నాయి. ఇటీవలే వైమానిక దళంలో చేరిన రఫేల్‌ యుద్ధ విమానాలు కూడా ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి.

వాయుసేన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరులకు కృతజ్ఞతలు తెలిపారు.

భారత గగనతలాన్ని రక్షించడంలో, విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడటంలో ఐఏఎఫ్‌ చేస్తోన్న కృషికి దేశం రుణపడి ఉంటుంది. రఫేల్‌, అపాచీ, చినూక్‌ వంటి అధునాతన యుద్ధవిమానాలతో ఐఏఎఫ్‌ మరింత బలమైన, వ్యూహాత్మక దళంగా మారింది

- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

వైమానిక దళ సిబ్బందికి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. వాయుసేన యోధులు ధైర్యానికి, శౌర్యానికి ప్రతీకలు. యుద్ధం, శాంతిభద్రతలను పరిరక్షించడంలో దేశం గర్వపడేలా సేవలందిస్తున్నారు. కీర్తిప్రతిష్ఠల్లో ఐఏఎఫ్‌ ఆకాశమంత ఎత్తులో ఉండాలని కోరుకుంటున్నా.

- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Last Updated : Oct 8, 2020, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.