ETV Bharat / bharat

దేశ రాజధాని దిల్లీలో చల్లారని పౌర జ్వాలలు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో చెలరేగిన నిరసన జ్వాలలు చల్లారడం లేదు. జామా మసీదు వద్ద ఈ రోజు ప్రార్థనల అనంతరం నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఉత్తర్​ ప్రదేశ్ భవన్​ వద్ద ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. భీమ్​ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్​ను విడుదల చేయాలంటూ వందలాది మంది చేతులుకట్టుకుని ర్యాలీ నిర్వహించారు.

author img

By

Published : Dec 27, 2019, 5:38 PM IST

Updated : Dec 27, 2019, 8:07 PM IST

Delhi protests
దేశ రాజధాని దిల్లీలో చల్లారని పౌర జ్వాలలు
దేశ రాజధాని దిల్లీలో చల్లారని పౌర జ్వాలలు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో పౌర జ్వాలలు చల్లారడం లేదు. ఈరోజు వందలాది మంది నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. నిషేధాజ్ఞలు విధించిన ప్రదేశాల్లో నిరసనలు చేపట్టిన వందలాది మంది నిరసనకారులను నిర్బంధించారు.

జామా మసీదు వద్ద ఆందోళనలు

దిల్లీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం వందలాది మంది నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దేశానికి కావాల్సింది ఎన్​ఆర్​సీ కాదని, ఉద్యోగాలు కావాలని గళమెత్తారు. ఈ ఆందోళనల్లో కాంగ్రెస్​ నాయకులు అల్కా లాంబ, శోయబ్​ ఇక్బాల్ పాల్గొన్నారు. దేశంలో నిరుద్యోగమే నిజమైన సమస్య అని.. ఎన్​ఆర్సీ కోసం ప్రజలను క్యూలో నిల్చునేలా చేసేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు లాంబ. నోట్ల రద్దు సమయంలోనూ ఇలానే జరిగిందని గుర్తు చేశారు. దేశం కోసం రాజ్యంగ గళాన్ని వినిపించాల్సిన అవసరముందన్నారు లాంబ.

ప్రధాని ఇంటికి మార్చ్​..

భీమ్​ ఆర్మీ అధినేత చంద్రశేఖర్​ ఆజాద్​ను​ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరసనకారులు లోక్ కల్యాణ్​ మార్గ్​లోని ప్రధాని ఇంటికి చేతులు కట్టుకుని మార్చ్​ నిర్వహించారు. బారీకేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకుని నిలిపివేశారు.

నిరసన సమయంలో చెలరేగే హింసకు తాము బాధ్యులం కాదని తెలిపేందుకే చేతులు కట్టుకుని ర్యాలీ నిర్వహించినట్లు ఆందోళనకారులు తెలిపారు. పౌరసత్వ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉత్తర్​ప్రదేశ్ భవన్​ వద్ద..

పౌరసత్వ చట్టానికి చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్​ప్రదేశ్​లో నిరసనలు చేపట్టిన వారిపై పోలీసులు చర్యలను ఖండిస్తూ దిల్లీలోని యూపీ భవన్ వద్ద వందలాది మంది ఆందోళనకు దిగారు. వీరందరనీ నిర్బంధించారు పోలీసులు. మందిర్ మార్గ్​ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి: గిరిజన పండుగలో ప్రత్యేక ఆకర్షణగా 'రాహుల్ నృత్యం'

Raipur (Chhattisgarh), Dec 27 (ANI): Congress leader Rahul Gandhi attended the inaugural function of 'Rashtriya Adivasi Nritya Mahotsav' and said that India's economy cannot run without taking people of all religion and caste along. Speaking at the event, Rahul Gandhi said, "You are well-versed to the current condition of the country. You know what exactly is happening in other states. India's economy cannot run without taking people of all religion and caste along. Until the voice of every Indian is heard in Lok Sabha and in state Assemblies, nothing can be done about unemployment and the state of economy. No matter how hard you try. I have been said in all the occasions that the economy runs by farmers, tribal, labours, etc."
Last Updated : Dec 27, 2019, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.