కాంగ్రెస్ దురహంకారానికి ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని ఆరోపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 1984 సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా 'జరిగిందేదో జరిగింది' అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మహాకూటమి పార్టీలపై ప్రజలకు ఏ మాత్రం విశ్వాసం లేదన్నారు మోదీ. వారికి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. మధ్యప్రదేశ్ రత్లాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని.
మధ్యప్రదేశ్లో రైతుల పంటరుణాలు మాఫీ హామీని నెరవేర్చడంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు మోదీ. భోపాల్ లోక్సభ అభ్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని విమర్శించారు.
ఇదీ చూడండి: దేశంలో మొదటి ఉగ్రవాది హిందువే: కమల్