దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)విద్యార్థులు పిలుపునిచ్చిన ఛలో పార్లమెంట్ మార్చ్ ప్రారంభమైంది. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో నిరసనల్లో భాగంగా విద్యార్థులు పార్లమెంట్ వరకూ మార్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. భద్రత కట్టుదిట్టం చేశారు. విశ్వవిద్యాలయం వెలుపల.. సుమారు 8 వందల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. పార్లమెంట్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
త్రిసభ్య కమిటీ ఏర్పాటు
విశ్వవిద్యాలయంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సూచనలు చేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ...త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. విద్యార్థులు, వర్సిటీ యంత్రాంగంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుంది. అదే సమయంలో సమస్యల పరిష్కారానికి.. సూచనలు చేస్తుంది. హాస్టల్ మాన్యువల్ ముసాయిదా, హాస్టల్ఫీజుల పెంపు, డ్రెస్కోడ్కు నిరసనగా విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.
మూడు వారాలుగా నిరసనలు
ఇటీవల వసతి గృహాల ఫీజులు పెంచుతూ జేఎన్యూ కార్యనిర్వాహక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనపై తీవ్ర చేఆగ్రహం వ్యక్తం సిన విద్యార్థులు దాదాపు మూడు వారాల నుంచి ఆందోళన చేపట్టారు.
ఇదీ చూడండి : జేఎన్యూ ఫీజుల పెంపుపై విద్యార్థుల పోరు తీవ్రం