ETV Bharat / bharat

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ

విదేశాల నుంచి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం ఓ కమిటీని నియమించింది. భారత్​లో ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునే విధంగా కమిటీ సిఫార్సులు చేయనుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ.. 15 రోజుల్లో నివేదిక అందజేయనుంది.

HRD Min sets up panel to form guidelines for more students studying in India
విద్యార్థుల సమస్య పరిష్కారానికి కేంద్రం కమిటీ
author img

By

Published : Jul 24, 2020, 8:00 PM IST

భారత్​లో ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునే విధంగా మార్గదర్శకాలు రూపొందించడం సహా కొవిడ్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకునేందుకు సలహాలు ఇచ్చే విధంగా ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.

గతేడాది 7.5 లక్షల మంది భారతీయులు ఇతర దేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లారని... దీనివల్ల విదేశీ మారకం సహా ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా భారత్​ నుంచి బయటకు వెళ్తున్నట్లు రమేశ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిభావంతులందరూ ఇక్కడే చదువుకునేలా అన్ని ప్రయత్నాలు చేయాలని అన్నారు.

"ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితి కారణంగా విదేశాలలో చదువుకోవాలనుకున్న చాలా మంది విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. వీరిలో చాలా మంది భారతదేశంలోనే చదువుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. చదువు పూర్తవుతుందో లేదో అనే భయంతో దేశానికి తిరిగివచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ రెండు వర్గాల విద్యార్థుల అవసరాలను తీర్చడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. భారతదేశంలోని ప్రధాన సంస్థలలో తగిన అవకాశాలను కల్పించి వీరు ఇక్కడే చదువుకునే సదుపాయాలు ఏర్పాటు చేయాలి. విదేశాల నుంచి తిరిగి వచ్చే విద్యార్థుల ఆందోళనలను సైతం పరిష్కరించాల్సిన అవసరం ఉంది."

-రమేశ్ పోఖ్రియాల్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి

ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2024 నాటికి భారత్​లోని అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్ల సామర్థ్యాన్ని 50 శాతం పెంచాల్సి ఉందన్నారు కేంద్రమంత్రి పోఖ్రియాల్. అంతేకాకుండా అత్యున్నత విద్యాసంస్థల సంఖ్యను 2024 కల్లా 50కి పెంచాల్సి ఉందని చెప్పారు.

15 రోజుల్లో నివేదిక

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ.. దేశంలో విశ్వవిద్యాలయాలు మెరుగైన పనితీరు కనబర్చేందుకు అవసరమైన సిఫార్సులు చేయనుంది.

మల్టీ డిస్​ప్లినరీ ప్రోగ్రామ్​లు, ఉమ్మడి డిగ్రీ కార్యక్రమాలు, క్రాస్​-కంట్రీ సెంటర్లు, అత్యుత్తమ విదేశీ ఫ్యాకల్టీ చేత ఆన్​లైన్ లెక్చర్లు, విద్యా రంగాన్ని పరిశ్రమతో అనుసంధానం చేయడం వంటి అంశాలపై ఈ కమిటీ అన్వేషణ సాగిస్తుందని అధికారులు తెలిపారు. 15 రోజుల్లోగా ఈ కమిటీ తన నివేదిక అందజేస్తుందని వెల్లడించారు.

ఇదీ చదవండి- రాజ్​భవన్​లో 'రాజ'కీయం- అసెంబ్లీ సమావేశం కోసం ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.