కరోనాపై పోరాటంలో మాస్కులు ధరించడం ఒక ముఖ్యమైన భాగం. వాటిని ఎలా ఉపయోగించాలంటే..
- ముక్కు, నోటి గుండా వైరస్ శరీరంలోకి వెళ్లకుండా మాస్కులు పెట్టుకోవడం మంచిది.
- మాస్కులు సరి చేసుకోవడానికి పదేపదే ముఖాన్ని తాకకూడదు. తాకడం వల్ల వైరస్ ముప్పు పెరుగుతుంది.
- మాస్కులు పెట్టుకునే ముందు, వాటిని ముట్టుకున్న తర్వాత, వాడి పారేసిన తర్వాత చేతులను సబ్బు లేదా శానిటైజర్లతో కడుక్కోవడం తప్పనిసరి.
- నోరు, ముక్కును పూర్తిగా కప్పివేసినట్లు మాస్కు పెట్టుకోవాలి. ఎక్కడా ఖాళీలుండకూడదు.
- మాస్కును వెనుక నుంచి మాత్రమే తీయాలి. ముందుభాగాన్ని ముట్టుకోవద్దు.