ETV Bharat / bharat

పురుషులు, వృద్ధులకే కరోనా సోకే అవకాశం ఎక్కువ!

author img

By

Published : Mar 28, 2020, 11:32 AM IST

Updated : Mar 28, 2020, 2:11 PM IST

చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి వృద్ధులు, పురుషుల్లోనే అధికంగా ఉందా? అంటే అవుననే అనిపిస్తోంది. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన, మృతి చెందిన కేసులను గమనిస్తే ఇది నిజమనిపిస్తుంది. మరి దీని ప్రభావం మహిళలకు లేదా? ఇది ఎంతవరకు నిజం?

How coronavirus mysteriously killed males, elderly people
కరోనా వైరస్​ పురుషులు-వృద్ధులకే అధికంగా సోకుతుందా!

ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న కరోనా.. పురుషులు, వృద్ధులనే లక్ష్యంగా చేసుకుందా? ప్రస్తుతం నమోదైన కేసులను గమనిస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఈ మహమ్మారి బారిన పడిన వారిలో అధికంగా వృద్ధులు, పురుషులే ఉన్నారు. వీరిలోనూ శ్వాసకోశ, గుండె, ఆస్తమా, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారు దీని బారిన పడుతున్నారు.

వృద్ధులు అధికం

కరోనా వైరస్​ను ఎదుర్కోవడం వృద్ధులకు కష్టంగా మారింది. 50 ఏళ్లకు పైబడిన వారికి పలు అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల ఈ వైరస్​ సోకుతుంటే కోలుకోవడానికి వారి రోగనిరోధక శక్తి సరిపోవడం లేదు.

దేశంలో తొలి కరోనా మృతి కేసు అయిన కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వ్యక్తికి అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం ఉండగా వైరస్​ సోకింది. ఇవి ఉండగా కరోనా రావడం వల్ల ఆయన చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ కూడా ఇలాంటి లక్షణాలతోనే మరణించింది. ఈమెకు స్విట్జర్లాండ్​ నుంచి వచ్చిన తన కొడుకు ద్వారా వైరస్​ సోకింది. బిహార్​కు చెందిన ఓ కిడ్నీ బాధితుడికి ఈ వైరస్​ సోకగా అతడూ మరణించాడు.

మహారాష్ట్రలో నలుగురు వారే

మహారాష్ట్రలో వారంలోనే నలుగురు వృద్ధులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు 63 ఏళ్ల వారు కాగా, మిగిలినవారికి 60, 72 సంవత్సరాలు. వీరందరికీ రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి.

కోల్​కతాలో...

కోల్​కతాలో ఓ 55 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకగా అతడు గుండెపోటుతో మృతి చెందాడు. టిబెట్​ నుంచి వచ్చిన 69 ఏళ్ల వ్యక్తి కరోనాకు బలయ్యాడు. కరోనా సోకిన తర్వాత మరణించిన బంగాల్​కు చెందిన 57 ఏళ్ల వ్యక్తికి కూడా పలు వ్యాధులు ఉన్నాయి. వీరంతా పురుషులే కావడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం.

అందరిలో అదే లక్షణం

ఇప్పటివరకు కరోనా వైరస్​ అధికంగా పురుషులకే సోకింది. అదీ 50 నుంచి 70 ఏళ్ల వయసున్న వారికే ఎక్కువ. వీరంతా అనేక రుగ్మతలతో బాధపడుతున్న వారే. కేవలం బిహార్​లో మరణించిన వ్యక్తి ఒక్కడే యువకుడు.

" చైనా ఇచ్చిన సమాచారంలోనూ పురుషులకు, వృద్ధులకు అధికంగా కరోనా సోకిందని వెల్లడైంది. వైద్య పరిశోధకుల నివేదికలో కూడా మహిళల కంటే పురుషులకే ఈ మహమ్మారి ఎక్కువగా సోకిందని తేలింది. భారత్​లోనూ ఇదే పరిస్థితి నెలకొంది."

--- డాక్టర్​ రణదీప్​ గులేరియా, ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​

కరోనా విషయంలోనూ అదే జరిగింది

ఏ వైరస్​ వ్యాప్తి చెందినా అది అధికంగా వృద్ధులపైనే ప్రభావం చూపుతుందని, కరోనా విషయంలోనూ అదే జరిగిందని గురుగ్రామ్​ ప్రాణ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్​ పి.వెంకట్​ కృష్ణన్​ అన్నారు. వృద్ధులు పలు వ్యాధుల బారిన పడడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని చెప్పారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

" ప్రస్తుతం ఇంట్లో ఉండే వృద్ధులు తప్పనిసరిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వృద్ధాశ్రమంలో ఉండే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో వీరి వద్దకు ఎక్కువ మంది రాకుండా చూసుకోవాలి. స్నేహితులు, కుటుంబసభ్యులతో కేవలం ఫోన్లలోనే మాట్లాడాలి. సాధారణంగా వృద్ధులకు మధుమేహం, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉండడం వల్ల ఈ వైరస్​ సోకితే కోలుకోవడం కష్టం. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి."

-- డాక్టర్​ జ్ఞాన భారతి, ఘజియాబాద్​

ఇదీ చదవండి: స్వీయ నిర్బంధంలో ఏం తినాలి? ఏం తినకూడదు?

Last Updated : Mar 28, 2020, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.