ETV Bharat / bharat

ల్యాండర్​తో సంబంధాలపై ఆశలు లేనట్లేనా..! - ఇస్రో

చంద్రయాన్-2.. ల్యాండర్ విక్రమ్​తో సంబంధాల పునురద్ధరణపై ఆశలు సన్నగిల్లుతున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రయత్నాలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు.

'ల్యాండర్​తో సంబంధాలపై సన్నగిల్లుతున్న ఆశలు'
author img

By

Published : Sep 8, 2019, 7:18 PM IST

Updated : Sep 29, 2019, 10:02 PM IST

చంద్రుని ఉపరితలంపై ల్యాండర్​ విక్రమ్ జాడ గుర్తించినప్పటికీ... సమాచార వ్యవస్థను పునురిద్ధరించడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. సమయం మించిపోతోందని, ఈ ప్రక్రియ అంత సులభం కాదన్నారు. అయితే తమ ప్రయత్నాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

చంద్రుని ఉపరితలంపై ఉన్న విక్రమ్​ ల్యాండర్​ ఆచూకీ తెలిసినట్లు ఇస్రో ఛైర్మన్​ కె. శివన్ అంతకుముందు​ తెలిపారు. అయితే తాము ప్రయత్నించినట్టు ల్యాండర్...​ జాబిల్లిపై మృదువుగా దిగి ఉండకపోవచ్చన్నారు.

రోవర్​ ప్రజ్ఞాన్​.. ల్యాండర్​లోనే ఉన్నట్లు చంద్రయాన్​-2 ఆర్బిటర్​లోని కెమెరాల్లో నిక్షిప్తమైందన్నారు శివన్​. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్​ బలంగా దిగి ఉంటే.. ఏమైనా హాని కలిగి ఉంటుందా? అన్న ప్రశ్నకు మాత్రం.. ఇంకా ఆ వివరాలు తెలియలేదని బదులిచ్చారు.

చంద్రయాన్‌-2 సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో భాగంగా చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తింది. ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి ఇస్రో కేంద్రానికి సంకేతాలు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో యావత్‌ భారతావని నిరాశ చెందిన సమయంలో ల్యాండర్‌ ఆచూకీ లభించడం ఊరట కలిగించింది.

చంద్రయాన్​-2: 'విక్రమ్'​ ఆచూకీ కనిపెట్టిన ఆర్బిటర్​

New Delhi, Sep 08 (ANI): Congress leader Ghulam Nabi Azad paid tribute to the late eminent lawyer Ram Jethmalani. Ram Jethmalani passed away early morning at the age of 95. He was a six-time Rajya Sabha member, and had served in the united front and NDA governments. Jethamalani had also fought several high profile cases in his lifetime.

Last Updated : Sep 29, 2019, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.