దేశంలో ప్రైవేటు పారిశ్రామిక రంగంలో కరోనా సోకిన బాధితులు సంఖ్య, ఆ వ్యాధి బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో వారికి అందజేసే పరిహారం మొత్తాన్ని నిర్ణయించే అధికారాన్ని ప్రైవేటు సంస్థలకే విడిచిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
"ప్రస్తుతం ఉన్న చట్టాల్లో కొవిడ్-19 లేనందున.. ఇందుకు సంబంధించిన ఎలాంటి పరిహారమైనా ప్రైవేటు కంపెనీలే నిర్ణయించాలి. కరోనా బారిన పడిన కార్మికులు, చనిపోయిన కార్మికులను పారిశ్రామిక అనారోగ్యం, మరణాల కింద పరిగణించాలా? వద్దా? అనేది యాజమాన్యం నిర్ణయించుకోవాలి. అప్పుడే పరిహారాన్ని నిర్ణయించగలరు"
-కేంద్ర కార్మిక శాఖాధికారి.
ప్రస్తుతం పని ప్రదేశంలో మరణాలు, క్షతగాత్రులకు సంబంధించి రెండు చట్టాలు ఉన్నాయి. కార్మికుల పరిహార చట్టం, ఉద్యోగుల రాజ్య బీమా చట్టం, వీటితోపాటు పని ప్రాంతాల్లో ప్రమాదాలను అడ్డుకునేందుకు(కార్మికుల భద్రతకు) కర్మాగారాల చట్టం కింద మార్గదర్శకాలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం నేపథ్యంలో పని ప్రదేశంలో కొవిడ్ బారిన కార్మికులు, కరోనాతో మరణించిన కార్మికులకు పరిహారానికి సంబంధించి ప్రైవేటు సంస్థలు ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌వోపీ) రూపకల్పనపై దృష్టి పెట్టాయి.
ఇదీ చూడండి:ఇంట్లోకి దూరి కుక్కను లాక్కెళ్లిన చిరుత