కరోనా సమయంలో ప్రభుత్వ వైద్యులు అందిస్తున్న సేవలు దేశసైనికుల విధులకన్నా తక్కువేమీ కాదు. కుటుంబాలను విడిచి వ్యాధిగ్రస్థుల బాగోగులపైనే శ్రద్ధ చూపుతున్నారు. దిల్లీలోని దిల్షాద్ గార్డెన్లో ఉన్న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కరోనా నివారణ విభాగం సమన్వయ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ అజిత్ జైన్ (52)దీ ఇలాంటి ఉదంతమే.
ఆసుపత్రికి 13 కిలోమీటర్ల దూరంలోని కమలానగర్లో ఆయన ఇల్లుంది. కారు మీద వెళ్తే అరగంట ప్రయాణం. కానీ మార్చి 17 నుంచి ఆసుపత్రిలోనే ఉండిపోయారు. 170 రోజుల తరువాత(దాదాపు ఆరు నెలలు) సెలవు తీసుకొని తొలిసారిగా గురువారం రాత్రి ఇంటికి వెళ్లారు. దాంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. భార్య గేటు దగ్గరికి వచ్చి హారతి ఇచ్చి తిలకం దిద్దారు. ఇద్దరు కుమార్తెలు గట్టిగా హత్తుకున్నారు. కుమారుడు దీన్నంతా వీడియో తీశారు. ఇంట్లోకి వెళ్లి కేక్ కట్ చేశారు. రోగుల తాకిడి అధికంగా ఉండడం, ఇంట్లో వారికి వ్యాధిని వ్యాపింపచేయకూడదని భావించటంతో ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చిందని తెలిపారు. 'మొదటి మూడు నెలలు పాటు చాలా ఒత్తిడిగా ఉంది. ఇప్పుడు కూడా పరిస్థితి అంతే. సెలవు పూర్తయిన తరువాత యథావిధిగానే విధులు ఉంటాయి.' అని అజిత్ జైన్ చెప్పారు.
-
Doctor Ajit Jain, the nodal officer for #COVID19 at RGSSH, met his family for the first time since March 17. He could have travelled home, which is just a 30-drive from hospital, daily, but he chose duty over family.
— Gaurav Saini (@shadow_seagull) September 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Emotions! #CoronaWarriors #DelhiFightsCorona @PTI_News pic.twitter.com/I8IMTvrDiM
">Doctor Ajit Jain, the nodal officer for #COVID19 at RGSSH, met his family for the first time since March 17. He could have travelled home, which is just a 30-drive from hospital, daily, but he chose duty over family.
— Gaurav Saini (@shadow_seagull) September 5, 2020
Emotions! #CoronaWarriors #DelhiFightsCorona @PTI_News pic.twitter.com/I8IMTvrDiMDoctor Ajit Jain, the nodal officer for #COVID19 at RGSSH, met his family for the first time since March 17. He could have travelled home, which is just a 30-drive from hospital, daily, but he chose duty over family.
— Gaurav Saini (@shadow_seagull) September 5, 2020
Emotions! #CoronaWarriors #DelhiFightsCorona @PTI_News pic.twitter.com/I8IMTvrDiM
ఇదీ చూడండి: 'వందే భారత్'తో స్వదేశానికి చేరిన 15 లక్షల మంది