కర్ణాటక వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ఎరియల్ సర్వే చేపట్టనున్నారు. బెళగావి జిల్లాలో వరద పరిస్థితులను అంచనా వేయనున్నారు.
భారీ వర్షాలకు కర్ణాటకలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. 17 జిల్లాల్లో 80 ప్రాంతాలు వరద ప్రభావానికి గురైనట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. వరదల కారణంగా ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే ప్రాణ, ఆస్తి, పంట నష్టాలను అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
ఇదీ చూడండి: కర్ణాటక: ప్రాణాల కోసం సాహసం చేయాల్సిందే.!