జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. తాజాగా హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన తీవ్రవాది శౌకత్ అహ్మద్ తాంతరీని బడ్గామ్ జిల్లాలో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కుల్గాం జిల్లా వార్పొరా ప్రాంతానికి చెందిన తాంతరీ బడ్గామ్.. కాజిపోరాలో ఉన్నట్లు సమాచారం మేరకు నిర్బంధ తనిఖీలు చేపట్టారు పోలీసులు. అనంతరం.. అదుపులోకి తీసుకున్నారు. ఛాడూరా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ