ETV Bharat / bharat

కరోనా మృతదేహాలపై కేంద్రం మార్గదర్శకాలు! - corona deaths

విదేశీ, విమాన ప్రయాణాల్లో ఉన్న కరోనా బాధిత, అనుమానిత మృతదేహాలపై అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. విమానాశ్రయాలకు, పైలట్లకు పలు సూచనలు చేసింది. కరోనా శవపేటికలు, విమానాల్లో ప్రాణాలు కోల్పోయినవారి పట్ల ఈ నియమావళిని అనుసరించి నడుచుకోవాలని తెలిపింది.

health ministry
కరోనా మృతదేహాలపై కేంద్రం మార్గదర్శకాలు
author img

By

Published : Apr 22, 2020, 5:51 AM IST

కరోనా బాధిత, అనుమానిత మృతదేహాలను భారత్​కు తీసుకురావడంపై మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. ఇలాంటి కేసుల్లో మృతదేహాలను నేరుగా తీసుకురావడం సరికాదని వెల్లడించింది. అయితే.. బాధితుల పార్థీవదేహాలను తీసుకురావాలన్న సందర్భాల్లో పలు నియమాలను పాటిస్తేనే దేశంలోకి అనుమతించాలని తెలిపింది.

  • మృతికి కారణాన్ని తెలిపే మరణ ధ్రువీకరణ పత్రం ఉందో లేదో విమానాశ్రయ ఆరోగ్య అధికారి తనిఖీ చేయాలి. రవాణాకు ఎలాంటి అభ్యంతరం లేదన్న భారత అధికారుల అనుమతి పత్రం ఉండాలి. అధికార యంత్రాంగం ధ్రువీకరించిన ఎంబామింగ్ పత్రం ఉండాలి.
  • మృతదేహాన్ని ఉంచిన శవపేటిక దెబ్బతిన్నదా లేదా అనే అంశాన్ని సంబంధిత విమాన అధికారులు నిర్ధరించాలి. విమానాశ్రయ అధికారి సంబంధిత పత్రాలను పరీక్షించి.. భారత విమాన చట్టం, 1954 ప్రజారోగ్య నిబంధనల ప్రకారం శవపేటిక ఉందా అనే అంశాన్ని పరిశీలించాలి.
  • శవపేటిక దెబ్బతిన్న సందర్భంలో దాన్ని తీసుకెళ్లే వ్యక్తులు పూర్తిస్థాయిలో పీపీఈ రక్షణ కవచాలను ఉపయోగించాలి. పేటికను ప్లాస్టిక్ షీట్లలో చుట్టాలి. మృతదేహాన్ని, అందులోని రసాయనాలను తాకొద్దు. అంతిమ సంస్కారాలు చేసేందుకు శవపేటికను అధికారులకు అప్పగించాలి.
  • మృతదేహంలో అత్యంత ప్రమాదకర వ్యాధికారకాలు ఉన్న కారణంగా శవపేటికను వైద్య నియమాలను అనుసరించి పూడ్చడం, కాల్చడం చేయాలి. శవపేటికను మోసినవారు 28 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. తీసుకెళ్లిన వాహనాన్ని శానిటైజ్ చేయాలి.
  • శవపేటికను తీసుకొచ్చిన విమానాన్ని వైద్యుల మార్గదర్శకాల ప్రకారం శానిటైజ్ చేయాలి. విమానంలో ఎక్కించిన సిబ్బంది కూడా 28 రోజులపాటు నిర్బంధంలో ఉండాలి.
  • దహన సంస్కారాలు నిర్వహిస్తే.. బూడిదను సేకరించే బంధులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే చట్టానికి అనుగుణంగా దానిని తొలగించాలి.
  • మహమ్మారి ప్రబలుతున్న కారణంగా విమాన ప్రయాణంలో ఉండగా మరణించిన వ్యక్తి ఎవరినైనా కరోనా బాధితుడిగా పరిగణించాలి. పైలట్ విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు సమాచారం అందించి.. అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలపాలి.
  • విమానం భారత గగనతలంలో ఉండగా మరణిస్తే విమాన సిబ్బంది ఆ మృతదేహాన్ని ప్లాస్టిక్ షీట్లు, బ్లాంకెట్లతో కప్పేయాలి. చుట్టూ ఉన్న ప్రయాణికులను ఇతర సీట్లకు పంపించాలి. విమానం ఎనిమిది గంటలపాటు ప్రయాణించే అవకాశం ఉంటే.. సమీపంలో ఉన్న విమానాశ్రయానికి సమాచారం అందించాలి. విమానాన్ని కిందకు దించి అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
  • చనిపోయేముందు కనిపించిన లక్షణాలతో అధికారులకు నివేదిక అందజేయాలి.

ఇదీ చూడండి: కారు ఆపిన పోలీసుకు గుంజీల శిక్ష!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.