అయోధ్య పర్యటనను శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వాయిదా వేసుకున్నారు. మహారాష్ట్రలో శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ఎన్సీపీ కోర్ కమిటీ తీర్మానించిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం ఏర్పాటుపై కసరత్తు జరుగుతున్న దృష్ట్యా ఈనెల 24న జరగాల్సిన పర్యటనను ఉద్ధవ్ వాయిదా వేసుకున్నట్లు శివసేన నేత ఒకరు తెలిపారు.
"ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీ, సేన, కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తవటానికి కొంత సమయం పడుతుంది. భద్రతా కారణాల దృష్ట్యా రాజకీయ నేతలు అయోధ్యలో పర్యటించడంపై ఇప్పటికే భద్రతా దళాలు నిషేధాజ్ఞలు విధించాయి. ఈ పరిణామాల దృష్ట్యా అయోధ్య పర్యటనను వాయిదా వేయాలని నిర్ణయించారు".
-శివసేన నేత
నవంబరు 9న రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు వెలువడిన రోజు అయోధ్య పర్యటనపై ప్రకటన చేశారు ఠాక్రే.
ఇదీ చూడండి : జేఎన్యూ విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్