ETV Bharat / bharat

వరద బాధితులకు హరీశ్​ రావత్​, ప్రీతమ్ పరామర్శ - UK Floods updates

ఉత్తరాఖండ్​ వరద బాధితులను పరామర్శించారు ఆ రాష్ట్ర మాజీ సీఎం హరీశ్​ రావత్​, కాంగ్రెస్​ నేత ప్రీతమ్​ సింగ్​. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్ర హెచ్చరికగా భావించి.. ఇప్పటికైనా మిగిలిన హిమనీనదాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు రావత్​. ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణమే పునరావాసాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రీతమ్.

Harish Rawat said that the big lake built above Raini village
ఉత్తరాఖండ్​ వరద బాధితులకు హరీశ్​ రావత్​, ప్రీతమ్ పరామర్శ
author img

By

Published : Feb 10, 2021, 7:41 PM IST

ఉత్తరాఖండ్​ జలప్రళయంలో నష్టపోయిన బాధితులను పరామర్శించారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్​ రావత్​, కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్​ సింగ్​. అక్కడి పరిస్థితులను పరిశీలించి.. భయబ్రాంతులకు గురైన రైనీ గ్రామ ప్రజలను ఓదార్చారు. అనంతరం.. పిపల్​కోటి, జోషిమఠ్​లోని ప్రజలకు తాత్కాలిక పునరావాస కేంద్రాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

'ప్రభుత్వం స్పందించాలి'

ఇంత పెద్ద విపత్తు సంభవించినప్పటికీ బాధిత ప్రజలకు ఎలాంటి సహాయం అందలేదని హరీశ్​ రావత్​ ఆరోపించారు. రైనీ గ్రామంపై ఉండే నందా దేవీ నదికి ఇతర కాలువలు కలవడం వల్ల.. అక్కడ పెద్ద సరస్సు ఏర్పడిందని రావత్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో హిమనీనదాలు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు మాజీ సీఎం. ఈ సంఘటనను ఓ హెచ్చరికగా భావిస్తూ.. ప్రభుత్వం ఇప్పటికైనా మిగిలిన హిమనీనదాలను నిశితంగా పర్యవేక్షించాలన్నారు.

ప్రీతమ్​ సింగ్​ ఏమన్నారంటే?

ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. ఈ గ్రామ ప్రజలకు తక్షణమే పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్​ సింగ్​. రైనీ గ్రామంలో బాధిత ప్రజలకు తమ పార్టీ.. భోజన వసతి కల్పించిందని, అనేక ఇతర ప్రదేశాలలోనూ శిబిరాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

గత ఆదివారం(ఫిబ్రవరి 7న) హిమనీనదం సృష్టించిన జలప్రళయంలో రిషిగంగ నదికి భారీ వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో సమీపంలోని రైనీ గ్రామప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఆ తర్వాత మలారీ రహదారిపై ఓ వంతెన కూలిపోవడం వల్ల.. సుమారు 13 గ్రామాలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 32 మంది మృతిచెందారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు జోరుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఐటీబీపీ, ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​, విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

ఇదీ చదవండి: ఆటంకాలు ఎదురైనా.. జోరుగా సహాయక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.