సార్వత్రిక ఎన్నికల ముందు కొందరు నేతలు సొంత పార్టీని వీడి మరోపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారం చేశారు. ఇంతకుముందు ఉన్న పార్టీపైనే విమర్శలు చేశారు. కానీ వారిలో చాలా మంది వ్యూహాలు ఫలించలేదు. ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. ఫలితాలు తారుమారయ్యాయి. ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం 76 మంది పార్టీ మారిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.
షాట్‌గన్ ఓటమి
ఇటీవలే భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరిన నటుడు, సీనియర్ నేత శత్రఘ్న సిన్హాకు ఘోర పరాభవం ఎదురైంది. బిహార్‌లోని పట్నాసాహిబ్ స్థానంలో ఆయనపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సుమారు 2.83 లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మరికొందరు
ఇటీవలే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన శరద్ యాదవ్ ఓడిపోయారు. ఎన్సీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తారిక్ అన్వర్... కతిహార్‌లో పరాజయం చెందారు.
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఓడిపోయారు. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర పరాజయం చెందారు.
కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి భాజపాకు వెళ్లిన ఎ.మంజు... హసన్ స్థానంలో ప్రజ్వల్ రేవణ్న చేతిలో ఓడిపోయారు.
కాంగ్రెస్ నుంచి తెదేపాలో వచ్చిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పరాజయం చెందారు. అలాగే ఆప్ అభ్యర్థి ధర్మవీర్ గాంధీ, యూపీలో కాంగ్రెస్ అభ్యర్థి నసీముద్దీన్ సిద్దిఖీ వంటి పలువురు కీలక నేతలు ఓటమిపాలయ్యారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన భోజ్‌పురి నటుడు రవి కిషన్.. గోరఖ్‌పుర్ స్థానంలో విజయం సాధించారు.
పశ్చిమ్ బంగాలో 10 మంది
పశ్చిమ్ బంగాలో ఎన్నికల ముందు 18 మంది పార్టీ మారి లోక్‌సభ పోటీలో నిలిచారు. అందులో 10 మంది ఓటమిపాలయ్యారు.
ఇదీ చూడండి: భారత్ తీర్పు: పనిచేయని ప్రియాంక మ్యాజిక్