గుజరాత్ సూరత్ జిల్లా మోరా గ్రామంలో లోని వలస కూలీల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమను సొంత రాష్ట్రాలకు పంపేందుకు అధికారులు వాహనాలు ఏర్పాటు చేయాలని వందల మంది కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఆగ్రహించిన కూలీలు అధికారులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు. కూలీలను అదుపు చేసేందుకు లాఠీ ఝుళిపించారు పోలీసులు. ఈ ఘటనలో మొత్తం 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు మోరా, హజీరా ప్రాంతాల్లోని కర్మాగారాల్లో పని చేస్తున్నట్లు వెల్లడించారు.